దేశంలో మరే అంశానికి ఇంత ప్రాధ్యాన్యత లేదు. ఇది నిన్నా ఇవాళా వ్యవహారం కానేకాదు. ఆ మాటకు వస్తే త్రేతాయుగానికీ  కలియుగానికి ముడిపడి ఉన్న వ్యవహారం. పైగా డెబ్బయ్యేళ్ళుగా న్యాయస్థానాల్లో నలుగుతున్న వ్యవహారం. మొత్తానికి తుది తీర్పు వచ్చేసింది. ఈ తీర్పు  కోసం దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఆసక్తిని కనబరచారు. బహుశా ఇంత పెద్ద ఎత్తున ఆసక్తిని కనబరచిన తీర్పు మరోటి ఉండడేమో


అయోధ్య తీర్పుని అయిదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం ఉదయం పదిన్నర గంటలకు మొదలుపెట్టింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తీర్పు పాఠాన్ని చదివి వినిపించారు. అయోధ్య విషయంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ  అంతటా కనిపించింది. అందరూ కూడా ఈ తీర్పు కోసమే కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు.


రాముడు అయోధ్యలో ఉన్నాడని నమ్మినవారు, నమ్మనివారు సైతం ఈ తీర్పు ఎలా వస్తుందోనని ఆసక్తిని పూర్తిగా తమలో నిండుగా నింపుకున్నారు. నిజంగా  అయోధ్య విషయంలో మూడు దశాబ్దాలుగా రాజకీయ దుమారం కూడా రేగుతూనే ఉంది. మొత్తం మీద నలభై నిముషాల వ్యవధిలో అయోధ్య తీర్పుని ధర్మానసనం మొత్తం చదివి వినిపించింది. దేశమంతా ఒకటిగా నిలిచి కళ్ళూ చెవులూ అన్నీ సుప్రీం కోర్టు వైపే ఉంచి మరీ ఆలకించింది. ఇది నిజంగా రికార్డ్ క్రియేట్ చేసిన తీర్పుగానే చెప్పాలి., ఇదిలా ఉండగా అయోధ్య విషయంలో డెబ్బయ్యేల్ల నాటి తగువు. దాన్ని ముప్పయ్యేళ్ళుగా రాజకీయ సమరం చేసి రగిల్చారు. దేశంలో అల్లకల్లోలానికి అయోధ్యను ఆయుధంగా కొన్ని శక్తులు చేసుకున్నాయి. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు అయోధ్య తీర్పు అన్నది చాలా చారిత్రాత్మకమనే చెప్పాలి. రాముడు. అయోధ్య బాబ్రీ మసీద్ ఇలా  కొన్ని దశాబ్దాలు ఈ దేశంలో గడచిపోయిన వేళ ఈ తీర్పు అందరిలో పెను ఆసక్తిని రగిలించిందనడంలో సందేహం లేదు.




మరింత సమాచారం తెలుసుకోండి: