మూడు నెలల్లో అయోధ్య చట్టం కింద ట్రస్ట్ ఏర్పాటు చేసి 2.77 ఎకరాల భూమిని ట్రస్ట్ కు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వాలని కూడా చెప్పింది. బాబర్ కాలంలో బాబ్రీ మసీదు కట్టారని సుప్రీంకోర్టు అంటోంది. బాబ్రీ మసీదును ఖాళీ ప్రదేశంలో నిర్మించలేదని కూడా చెబుతోంది. బాబ్రీ మసీదు నిర్మాణం కింద మరో నిర్మాణం ఉన్నట్టు తెలిపారు. నిజానికి 12 నుంచి 16వ శతాబ్దాల మధ్య జరిగినదానికి ఆధారాలు కూడా లేవు. ఆలయం కూల్చేసారనే దానికీ ఆధారాలు లేవంటోంది. న్యాయ సూత్రాల ఆధారంగానే భూ వివాదం పరిష్కారం అవుతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అంటున్నారు.




అయోధ్యను రామ జన్మభూమిగా నమ్ముతున్నారని చీఫ్ జస్టిస్ వాఖ్యలు చేశారు. పురావస్తు శాఖ నివేదిక ఆధారంగా  ప్రధానమైన డోమ్ కింద రాముడి జన్మస్థానం అనే విశ్వాసం ఉంది. హిందువులు ఇదే విశ్వసిస్తారు. కానీ నమ్మకం, విశ్వాసం ఆధారంగా తీర్పు ఇవ్వలేమని కూడా సుప్రీం చెబుతోంది. ఇక్కడ ముస్లింలు నమాజ్ చేసినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి. దీనిపై వక్ఫ్ బోర్డు వేసిన పిటిషన్ కూడా నిబంధనలకు అనుగుణంగానే ఉందని కూడా సుప్రీంకోర్టు చెబుతోంది. వాస్తవంలో మసీదు నిర్మించిన స్థలం బాబర్ కు చెందినట్టుగా ముస్లిములు నిరూపించలేకపోయారు. అక్కడ ఆలయం ఉండేదని హిందువులు కూడా నిరూపించలేకపోయారు. దీంతో ఈ స్థలంపై ఇద్దరికీ ఉమ్మడి హక్కులు ఉన్నాయనేది కూడా ఓ వాదన ఉంది.




ఇక్కడ పురావస్తు శాఖ వెల్లడించిన నివేదిక కీలకమవుతోంది. బాబ్రీ మసీదు ను ఖాళీ ప్రదేశంలో నిర్మించలేదన్న సుప్రీం వాఖ్యలు కూడా ఇక్కడ కీలకం కానున్నాయి. అంతేకాకుండా.. ఆలయం కూల్చేశారన్న ఆధారాలు లేవన్న సుప్రీం వాఖ్యలు అసక్తికరమే.


మరింత సమాచారం తెలుసుకోండి: