గత కొన్నేళ్లుగా భారత దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న అయోద్య తీర్పు నేడు వెలవరించారు.  ఈ వివాదం మొదలైనప్పటి నుంచి ఎన్నో రాజకీయ గొడవలు తెరపైకి వచ్చాయి.  అయితే ఈ సున్నతమైన అంశంపై కోర్టులో కూడా ఎన్నో వివాదాలు నడిచాయి. తీర్పు విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ వచ్చాయి.  ఇక అయోద్య విషయంలో ఎవ్వరూ తగ్గకుండా ఎవరి వాదనలు వారు వినిపిస్తూ వస్తున్నారు.  అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం సుదీర్ఘంగా 40 రోజుల పాటు ఇరు పక్షాల వాదనలు వింది.

అనంతరం అక్టోబర్ 16న తీర్పును రిజర్వులో పెడుతూ నిర్ణయం తీసుకుంది.  కానీ తీర్పు ఈ రోజు వెలువరించడం అందరినీ ఒకింత షాక్ కి గురిచేసినా.  సీజేఐ ఈ నెల 17 న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అంతకుముందే ఈ చారిత్రక తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ తుది తీర్పును చదివి వినిపించారు. వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్‌ బోర్డు క్లెయిమ్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సీజేఐ పేర్కొన్నారు. కొంత కాలంగా వివాదాంగా ఉన్న మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు.

కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని సీజేఐ వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని పేర్కొన్నారు.రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలని సీజేఐ తెలిపారు. అయోధ్య కేసుపై ఐదుగురు న్యాయమూర్తుల ఏక్రగీవ తీర్పు వెలువరించారు.

ప్రార్థనామందిరాల చట్టం ప్రాథమిక విలువలు, మతసామరస్యాన్ని పరిరక్షిస్తుందన్నారు. మసీదు నిర్మాణం కోసం వేరే స్థలం కేటాయించాలి సుప్రీంకోర్టు తెలిపింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రస్తకే లేదని స్పష్టం చేసింది.1993 ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలమివ్వొచ్చని సుప్రీం స్పష్టం చేసింది. ఏది ఏమైనా అయోద్యతీర్పు ఈరోజు నవంబర్‌ 9, 2019 చరిత్రలో నిలిచిపోయే రోజుగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: