ఎట్ట‌కేల‌కు ఆయోధ్య వివాదం పై సుప్రీం కోర్టు సంచ‌ల‌న త‌ర్పును ఇచ్చింది.  ముస్లింల కోసం ప్ర‌త్యామ‌న్యాయంగా ఐదు ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం  ఆదేశించింది.   ఈ స్థ‌లాన్ని మూడు నెల‌ల లోపే సునీవ‌ఖ్ఫ్‌బోర్డ్‌కి అప్ప‌గించాల‌ని తీర్పులో పేర్కొంది. భూమి కేటాయింపు రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిధిలో ఉన్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వాన్ని సుప్రీంకోర్ట్ ధ‌ర్మాస‌నం ఆదేశించింది. అయితే వివాదాస్ప‌దంగా ఉన్న 2.77 ఏక‌రాల భూమిని హిందువుల‌కు అప్ప‌గిస్తూ తుది తీర్పును ఐదుగురు జ‌డ్జిలతో కూడిన ధ‌ర్మాస‌నం తుది తీర్పు వెల్ల‌డించింది. బాబ్రీ మ‌సీదు నిర్మాణం కంటే ముందు  ఆ స్థ‌లంలో ఇస్లామ్ సాంప్ర‌దాయానికి సంబంధించిన‌ ఎలాంటి నిర్మాణాలుగాని, ఆన‌వాలుగాని లేవ‌ని పేర్కొంది. దీంతో ఆ స్థలం బాబ్రీ మ‌సీద్ కంటే ముందు హిందువుల‌కు చెందిన‌దిగా మ‌రేదో నిర్మాణ ముంద‌ని వెల్ల‌డించారు. సున్నీవ‌ఖ్ఫ్‌బోర్డ్ ఐదు ఎక‌రాల స్థ‌లం కేటాయించిన వెంట‌నే ఆ స్థ‌లంలో మ‌జీదు క‌ట్టుకోవ‌డానికి అనుమ‌తినిచ్చింది. ఆ స్థ‌లాన్ని కూడా ఆయోధ్య యాక్ట్ ప్ర‌కారం ఐదు ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయించిన‌ట్లు పేర్కొన్నారు. ఆ స్థ‌లాన్నికూడా ఆయోధ్య ప‌ట్ట‌ణంలోనే కేటాయించాల‌ని పేర్కొన్న‌ది.  ఇక మ‌రి దీని వెనుక ఉన్న ద‌శాబ్దాలుగా వివాదాస్పంలో ఉన్న స‌మ‌స్య పై సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది.  


ఇక‌పోతే దీని పై ప‌లు రాజ‌కీయ పార్టీలు విభిన్న కోణాల్లో ఆయా పార్టీల కోణాల్లో స్పందించారు.  ఈ తీర్పుతో ఆయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి లైన్ క్లియ‌ర్ అయింది. సున్నీ వ‌ఖ్ఫ్‌బోర్డ్ నాయ‌కులు తీప్పు పై అసంతృప్తి ఉన్న‌ప్ప‌టికీ దేశ ప్ర‌యోజ‌నాల రీత్యా అంద‌రూ సంయ‌మ‌నం పాటించాల‌ని సుప్రీంకోర్టు తీర్పును గౌర‌వించాల‌ని ప‌లువురు వ్యాఖ్యానించారు. దాంతో పాటు ప‌లు రాజ‌కీయ పార్టీలు కూడా ఈ తీర్పును గౌర‌విస్తూ ప్ర‌జలు కూడా ఎలాంటి మ‌త విద్వేశాల‌కు లోనుకాకుండా సంయ‌మం పాటించాల‌ని సూచించారు.  బాబ్రీ మ‌సీద్‌ను ధ్వంసం చేయ‌డం కూడా త‌ప్ప‌ని సుప్రీంకోర్టు పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: