గత 134 సంవత్సరాలుగా వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల స్ధలానికి సంబంధించిన తుది తీర్పును సుప్రీం కోర్టు కొద్దిసేపటి క్రితమే వెలువరించింది.  గతంలో ఈ స్థలానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పుపట్టింది.  వివాదాస్పద స్థలాన్ని మూడు సంస్థలకు కేటాయించింది.  అప్పటి అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 14 పిటిషన్లు వేశారు.  ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనలు నడిచాయి.  


దీనికోసం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంను ఏర్పాటు చేసి 40 రోజులపాటు వాదనలను విన్నది.  అనంతరం ఈరోజు తీర్పును వెలువరించింది.  సున్నితమైన వివాదంతో కూడుకొని ఉన్న తీర్పును అందరు గౌరవించాలని సుప్రీమ్ కోర్టు ముందుగానే చెప్పడం జరిగింది.  ముందుగా షియా స్పెషల్ లీవ్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.  అనంతరం చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది.  బాబ్రీ మజీద్ నిర్మాణానికి ముందు అక్కడ నిర్మాణం ఉందని, అయితే, ఆ నిర్మాణం ఏంటి అన్నది స్పష్టంగా తెలియదని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది.  


అంతేకాదు, బాబ్రీ మసీద్ ఎప్పుడు ఖచ్చితంగా నిర్మించింది అనే విషయం కూడా స్పష్టంగా తెలియలేదని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది.  మతపరమైన విషయాలతో తమకు సంబంధం లేదని, ఎవరి దగ్గరైతే ఆ భూమికి  సంబంధించిన పత్రాలు ఉన్నాయో వాళ్ళకే ఆ భూమిని అప్పగించాలని చెప్పింది. ఫైనల్ గా  వివాదాస్పద భూమిని పంచే ప్రసక్తి లేదని, అయోధ్య ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఆ భూమిని అందజేయాలని చెప్పింది.  అలానే అయోధ్యలో మరో ఐదు ఎకరాల స్థలాన్ని మసీద్ నిర్మాణం కోసం అందజేయాలని కోర్టు ఆదేశించింది.  


అలానే బాబ్రీ మసీద్ కూల్చివేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది.  రాముడు జన్మించింది అయోధ్యలోని అనే విషయంపై కూడా కోర్టు తీర్పులో పేర్కొంది.  రాముడు అయోధ్యలో జన్మించారని హిందువులు నమ్మకం అని, దానిపై ఎలాంటి సందేహం అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: