గత 134 ఏళ్లుగా అయోధ్యలోని 2.77 ఎకరాల స్థలంపై హిందూ, ముస్లింల మధ్య  వివాదం కొనసాగుతోంది. ఆ భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్‌లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వెలువరించగా, దీన్ని సవాల్‌చేస్తూ సుప్రీం కోర్టులో 14 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. కాగా, అయోధ్య వివాదంపై సామరస్యపూరిత పరిష్కారం కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎఫ్‌ఎం ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్ పంచులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.


అయితే ఈ కమిటీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు తీర్పును ఈ రోజు వెల్లడించింది. అది హిందువులకు అనుకూలంగా వచ్చింది. కాని ఇక్కడ గమనించ వలసిన విషయం ఏంటంటే ఒక్క హిందువు గెలవలేదు. భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు గెలిచాడు. అన్ని దేశాల్లా మన భారతదేశంలో మనుషుల్ని కులాలు బట్టి గౌరవించరు. మతమేదైన ప్రతి వారు సోదరులే  అందరు భరత మాత ముద్దు బిడ్దలే. ఇప్పుడు అయోధ్య విషయంలో వచ్చిన తీర్పులో ఆ నిజం మరోసారి రుజువైంది.

కడుపునింపని మతాల కోసం కొట్టుకునే సంస్కృతి మనది కాదు ఇక్కడ జీవించే ప్రతివారు  భరతమాత ఒడిలోని పిల్లలే అన్నదమ్ముల బంధంతో బ్రతుకుతున్న భారతీయులు ఒక్క మతం అనే పేరుతో కొట్టుకోవడం సరైన పద్దతికాదు. ఈ రోజు వచ్చిన తీర్పు హిందూ - ముస్లిం భాయ్ - భాయ్ అంటూ జీవించే మన సాంప్రదాయానికి, సంస్కృతికి ఇచ్చిన గౌరవంగా భావించాలి. ఎందుకంటే అన్ని మతాలను ఆదరించే దేశంగా భారతదేశానికి పేరున్నది.ప్రపంచంలో ఎక్కడ జీవించలేని వారు సైతం ఈ పుడమిలో ఆనందంగా జీవించే సౌలభ్యం ఉన్నది.

ఇది అనాదిగా మన పూర్వికుల వల్ల అబ్బిన లక్షణం. ఓ సోదరా భారతదేశం గెలిచింది. భారతీయ సోదరులు గెలిచారు అని భావించు తప్పితే మతం ఓడిందని భావించకు. ఎందుకంటే మతం కడుపు నింపడం లేదు. మతం నిన్ను బ్రతికించడం లేదు. మతం చూసి నిన్ను తనవారిగా భారతీయులు భావించడం లేదు. నీవు పోయేటప్పుడు మతం నీ వెంటరాదు.ఇదే జీవిత సత్యం..

మరింత సమాచారం తెలుసుకోండి: