ఎన్నో దశాబ్దాల నుండి రగులుతున్న వివాదానికి నేటితో తెరపడింది. అయోధ్యలో రామ మందిరం  నిర్మించాలని హిందువులు లేదు బాబ్రీ మసీదు నిర్మించాలని ముస్లింలు మధ్య  మొదలైన వివాదం కి తాజాగా సుప్రీంకోర్టు ముగింపు పలికింది. ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత ధర్మాసనం అయోధ్య  కేసుపై తీర్పు వెల్లడించింది 2.77 ఎకరాల స్థలంలో  హిందువులకు ముస్లిములకు మొదలైన వివాదం గత 70 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో  వివాదానికి తెర పడినట్లయింది. కాక ఈ తీర్పుపై దేశం మొత్తం హర్షం వ్యక్తం  చేస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడించిన ప్రజలందరూ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. 



 ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. అయోధ్యలో వివాదాస్పద భూమిని కొన్ని షరతులతో హిందువులకు కేటాయించాలని తెలిపిన  సుప్రీం కోర్టు...ముస్లిం లకు అయోధ్యలో ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని  తీర్పునిచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి ట్రస్ట్  ఏర్పాట్లు చేసి  ఆలయ నిర్మాణాని చేపట్టాలని సూచించింది. మూడు నెలల్లో ట్రస్ట్  ఏర్పాటు చేయాలనీ  అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది . కాగా  వివాదాస్పద అయోధ్య భూమి పక్కనే సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ స్తలాన్ని  కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేటాయించాలని సూచించింది.



1993లో కేంద్రం సేకరించిన వివాదాస్పద భూమికి అవతల సున్నీ వక్ఫ్ బోర్డు స్థలం కేటాయించాలని ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు పై స్పందించిన ప్రముఖులు  హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం  తీర్పు ఆనందాన్ని కలిగించిందని పిటిషనర్ ఇక్బల్ అన్సారీ  అభిప్రాయం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పారదర్శకంగా తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు తీర్పును అందరూ గౌరవించాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. కాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైన రాజ్నాథ్ సింగ్  అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా  ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తెర పడినట్లయింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎక్కడ అల్లర్లు జరకుండా పోలీసులు చాలా అలర్ట్ గా ఉన్నారు . సోషల్ మీడియాలో సుప్రీంకోర్టు తీర్పు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: