కొన్ని ద‌శాబ్దాలుగా మ‌న‌దేశంలో హిందువులు వ‌ర్సెస్ ముస్లింల మ‌ధ్య అనేక ఆందోళ‌న‌ల‌కు, ఉద్రిక్త‌ల‌కు కార‌ణ‌మ‌వుతూ ప్ర‌భుత్వాల‌కు సైతం తీర‌ని స‌మ‌స్య‌గా ఉన్న అయోధ్య కేసులో తుది తీర్పును ఈ రోజు అత్యున్న‌త ధ‌ర్మాస‌నం వెలువ‌రించింది. అయోధ్య‌లో వివాస్ప‌దంగా 2.77 ఎక‌రాల భూమిని రాముడికే చెందేలా తీర్పు ఇచ్చిన ధ‌ర్మాస‌నం అదే టైంలో ముస్లింల కోసం మ‌రో ఐదు ఎక‌రాలు కేటాయించాల‌ని కూడా తీర్పు ఇచ్చింది. పురావ‌స్తు శాఖ ఇచ్చిన ఆధారాల ఆధారంగానే తీర్పు వెలువ‌రించిన‌ట్టు కూడా ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.


ఈ టైంలోనే అయోధ్య రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేసిన ముగ్గురు మధ్యవర్తుల బృందాన్ని సుప్రీంకోర్టు ప్రశంసించింది. సుప్రీం కోర్టు అయోధ్య వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు రాజీ కోసం జస్టిస్ కలీఫుల్లా, శ్రీరాం పంచు, శ్రీశ్రీ రవిశంకర్‌లను సుప్రీంకోర్టు మధ్యవర్తులుగా నియమించిన సంగతి తెలిసిందే.  ఈ ముగ్గురు త‌మ వంతుగా అంద‌రి అభిప్రాయాలు తీసుకుని ఆ నివేదిక‌ను సుప్రీంకోర్టుకు ఇచ్చారు.


ఇక ఈ ముగ్గురు అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి పరిష్కారానికి దగ్గరగా వచ్చారంటూ కితాబిచ్చింది. అయోధ్య వివాదంపై కాగా అన్ని విశ్వాసాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ సుప్రీంకోర్టు ఇవాళ చారిత్రక తీర్పు వెలువరించింది. బాబ్రీ మసీదు కూల్చివేత చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసిన కోర్టు అదే టైంలో మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని పేర్కొంది. ఇక వివాదానికి కేంద్ర బిందువు అయిన వివాదాస్పద స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి కేటాయించింది.


బాబర్ కాలంలో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. ఇక మత గ్రంథాలను బట్టి కోర్టు తీర్పు ఉండదని తేల్చేశారు. పురావస్తు శాఖ అధ్యయనాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదును కట్టలేదన్న కోర్టు మ‌సీదు నిర్మాణానికి ముందు అక్క‌డ ఇస్లామిక్ నిర్మాణాలు లేవ‌ని కూడా చెప్పింది.



మరింత సమాచారం తెలుసుకోండి: