ఎన్నో ఏళ్లుగా రగులుతున్న  అయోధ్య వివాదానికి తెర పడింది. భారత దేశ ప్రజలు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కేసుకు  సుప్రీంకోర్టు ముగింపు పలికింది . ఐదుగురు సభ్యులతో అత్యున్నత ధర్మాసనం అయోధ్య కేసు పై తీర్పును వెల్లడించింది. 2.77 ఎకరాల స్థలంలో రామమందిరం నిర్మించాలి అని హిందువులు... లేదు బాబ్రీ మసీదు నిర్మించారని ముస్లింలు మధ్య గత 70 ఏళ్ల క్రితం తలెత్తిన వివాదం తాజా సుప్రీంకోర్టు తీర్పుతో పరిష్కారం అయ్యింది. అయోధ్య భూమి పై షియా వక్ఫ్ బోర్డు  వేసిన పిటిషన్ను కొట్టి వేసి ఏకగ్రీవ తీర్పునిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. అయోధ్య భూమి తమదేనంటూ తన పిటిషన్లో తెలిపిన షియా వక్ఫ్ బోర్డు పిటిషన్ ను  సుప్రీం కోర్టు కొట్టివేసింది.తీర్పు  వెల్లడించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్  ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని సుప్రీంకోర్టు గౌరవిస్తుందని తెలిపారు బాబర్  కాలంలో  మసీద్ నిర్మాణం జరిగిందన్న సుప్రీంకోర్టు... కానీ కచ్చితంగా మసీదు నిర్మాణం ఎప్పుడు జరిగింది  స్పష్టం కాలేదని తెలిపింది. కాగా  కొన్ని షరతులతో హిందువులకు అయోధ్య భూమి చెందుతుందని తెలిపిన అత్యున్నత ధర్మాసనం... కేంద్ర ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి  సంబంధించిన ఏర్పాట్ల కోసం ట్రస్ట్ ఏర్పాటు  చేయాలని చేయాలని కేంద్రానికి సూచించింది అత్యున్నత ధర్మాసనం. 



 కేంద్రం ట్రస్ట్ బోర్డు ను మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాగా సున్ని వక్ఫ్ బోర్డుకు  1993లో ప్రభుత్వం సేకరించిన వివాదాస్పద  స్థలం అవతల 5 ఎకరాల స్థలం  కేంద్రం లేదా రాష్ట్రం కేటాయించాలని సుప్రీంకోర్టు సూచించింది.ఆర్టికల్ 120 కింద నిర్మోహి అఖాడా వేసిన పిటిషన్ ను కొట్టివేసింది సుప్రీం కోర్టు.   దీంతో హిందూ పార్టీలో ఒక్కరైనా నిర్మోహి అఖాడా  వేసిన పిటిషన్ తొలగి పోయినట్లు అయింది. అయితే ఖాళీ స్థలంలో మసీదు నిర్మాణం జరగలేదన్న అత్యున్నత  ధర్మాసనం గతంలో అక్కడ  ఓ నిర్మాణం ఉండేదని తెలిపింది.   కాగా అయోధ్యలో అప్పట్లో   ఉన్నది ఆలయమా  మసీదు అన్నదానిపై ఆధారాలు లేవని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. 



 అయితే అయోధ్యలో రాముడు జన్మించాడని ప్రజలకు ఉన్న విశ్వాసాలను గౌరవిస్తున్నామన్న  సుప్రీంకోర్టు... నమ్మకాలు విశ్వాసాలు ఆధారంగా భూమిపై హక్కులను నిర్దారించలేమంటూ  తెలిపింది. ఇక శ్రీరామ్ లాల విరాజ్ మాన్  పిటిషన్పై స్పందించిన సుప్రీం కోర్టు మసీదు నిర్మాణం ఉన్నంత మాత్రాన ఆ భూమిపై హక్కు పొందే అవకాశం ఉండదని తెలిపింది. ఒకవేళ అక్కడ మసీదు ఉన్న హిందూ ఆలయం ఉన్న ఇదే వర్తిస్తుందని తెలిపింది. 1956- 57 సంవత్సరములో  ముస్లింలు ప్రార్థనలు చేయగా  హిందువులు బయట ప్రార్థనలు చేశారని అయితే లోపల ప్రార్థనలు చేసినంత మాత్రాన ముస్లింలకు హక్కు ఉండదని  అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అంతేకాకుండా 1857లో హిందువులు లోపల పూజలు చేసుకోకుండా ఎవరు అడ్డుకోలేదన్న  న్యాయస్థానం... ఆ ప్రదేశంలోనే రాముడు జన్మించినట్లు హిందువులు నమ్ముతున్నారని తెలిపింది. ముస్లిం లకు  ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని  చేసిన పిటిషన్ తో ఏకీభవించింది సుప్రీం కోర్టు. 





అయోధ్యలో వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు ఆ స్థలంలో ఆలయ నిర్మాణానికి మూడునెలల్లో కేంద్రం ట్రస్ట్ ను  ఏర్పాటు చేయాలని తెలిపారు. అయోధ్యలో మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని కేంద్రానికి ఆదేశించింది.సుప్రీంకోర్టు తీర్పుపై భారత ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు హిందువులు ఇటు  ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా అత్యున్నత న్యాయస్థానం పారదర్శకంగా తీర్పు వెలువరించింది అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ సుప్రీంకోర్టు అంతిమ తీర్పు అని  భారత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రాజకీయ ప్రముఖులు వివిధ ప్రముఖులు సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: