అయోధ్య‌లో వివాద‌స్ప‌ద భూమిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అఖిల భార‌త ముస్లిం ప‌ర్స‌న‌ల్‌ లా బోర్డు అసంతృప్తి వ్య‌క్తం చేసింది.  తీర్పు వెలువ‌డిన వెంట‌నే ముస్లీం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో స‌భ్యులు జ‌ప‌ర్సాబ్ జిలాని మాట్లాడుతూ... సుప్రీంకోర్టు తీర్పును గౌర‌విస్తున్నామ‌ని వెల్ల‌డించారు. తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిష‌న్ ను దాఖ‌లు చేసే అంశంపై చ‌ర్చించే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. 12వ శ‌తాబ్దం నుంచి 15వ శ‌తాబ్ధం వ‌ర‌కూ జ‌రిగిన అంశాల‌పై ఎలాంటి ఆధారాల‌ను సుప్రీంకోర్టు చూప‌లేద‌ని వ్యాఖ్య‌నించారు. 300 సంవ‌త్స‌రాల్లో ఏం జ‌రిగిందో కోర్టు స్ప‌ష్టం చేయలేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సుప్రీంకోర్టును తాము ఎల్ల‌ప్పుడు గౌర‌విస్తామ‌ని వెల్ల‌డించారు. తీర్పుపై ప్ర‌జ‌లు మ‌త విద్వేషాల‌కు లోను కాకుండా సంయ‌మ‌నం పాటించాల‌ని కోరారు. తీప్పు మ‌సీద్‌కి అనుకూలంగా వ‌స్తుంద‌ని భావించాం. మా అంచ‌నాల‌కు అనుగుణంగా రాలేదు. అయిన‌ప్ప‌టికీ కోర్టు తీర్పును గౌర‌విస్తున్నాం.  1045పేజీల‌ను తీర్పును పూర్తిగా చ‌ద‌వాల్సి ఉంది. పురావ‌స్తుశాఖ వెల్ల‌డించిన అంశాల్లో హిందువుల ఆధారాల‌ను మాత్ర‌మే సుప్రీంకోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ద‌ని, ముస్లింల ఆధారాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


ఈ విష‌యంలో ఎవ‌రూ ఎటువంటి ఆందోళ‌న‌లు చేయ‌రాద‌ని పేర్కొన్నారు. లాయ‌ర్ల‌తో మాట్లాడ‌తాం పూర్తి స్థాయిలో ప‌రిశీలించి  రివ్యూ పిటీష‌న్‌ను దాఖ‌లు చేస్తామ‌న్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది. అంద‌రూ సంయ‌మ‌నం పాటించాలి అని పేర్కొన్నారు.  చారిత్రాత్మ‌క  అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని తీర్పునిచ్చింది. మ‌న విశ్వాసాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. తీర్పును త‌న ఘ‌న‌త‌గా చాటుకోలేద‌ని శివ‌సేన చీప్ ఉద్ధ‌వ్ టాక్రే పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్‌కుమార్‌యాద‌వ్ సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తించారు. ప్ర‌జ‌లు సంయ‌మ‌నం పాటించాల‌ని కోరారు. తీర్పులో బాబ్రీ యాక్ష‌న్ క‌మిటీ తీప్పు పై అసంతృప్తి వ్య‌క్తం చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: