కొన్ని దశాబ్దాల పాటు కొనసాగుతున్న వివాదానికి నేడు సుప్రీం కోర్టు తీర్పుతో  తెరపడింది. భారత దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తీర్పు రానే వచ్చింది. ఎన్నోసార్లు విచారణ జరిగినప్పటికీ వాయిదా పడుతూ వచ్చిన అయోధ్య భూవివాదం కేసుకు తాజాగా సుప్రీం కోర్టు ముగింపు పలికింది. అయోధ్యలో రామమందిరం నిర్మించాలి అని హిందువులు బాబ్రీ మసీదు నిర్మించారని ముస్లింల మధ్య తలెత్తిన వివాదానికి సుప్రీంకోర్టు పారదర్శకంగా తుది తీర్పు వెల్లడించింది. ఎవరి మనోభావాలు నొచ్చుకోకుండా భిన్నత్వంలో ఏకత్వం లాంటి తీర్పును వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం. 



 ఐదుగురు సభ్యులతో అత్యున్నత ధర్మాసనం దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య భూవివాదం కేసులో తీర్పు వెలువరించారు. వివాదాస్పద అయోధ్య భూమిని కొన్ని షరతులతో హిందువులకు  చెందుతుంది అంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమి న్యాస్ కు అప్పగించింది సుప్రీంకోర్టు. కాగా మూడు నెలల్లో  ఆలయ నిర్మాణానికి ట్రస్ట్  ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత ధర్మాసనం. ముస్లింలకు ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అంతకు ముందుగా వివాదాస్పద భూమి తమదేనంటూ దాఖలైన  షియా వక్ఫ్ బోర్డు  పిటిషన్ను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం... మసీదును బాబర్  నిర్మించాడనే  దానిని సమర్థిస్తున్నట్లు పేర్కొంది.



 కాగా  వివాదాస్పద అయోధ్య స్థలం పక్కన ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రజల విశ్వాసాలను నమ్మకాన్ని తాము గౌరవిస్తున్నామని తెలిపింది సుప్రీంకోర్టు. కాగా  తీర్పు కాపీ చదివేందుకు అరగంట సమయం పట్టింది. అంతేకాకుండా మరోవైపు నిర్మోహి అఖాడా  పిటిషన్ను కూడా కొట్టివేసింది అత్యున్నత ధర్మాసనం. అయోధ్య భూమిపై హక్కుల విషయంలో నిర్మోహ అఖాడా వేసిన  పిటిషన్  కూడా సరిగా లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే వివాదాస్పద అయోధ్య భూమి ప్రదేశంలో హిందువులు ముస్లింలు ప్రార్థనలు చేసేవారు అని అలా అని అక్కడ మసీదు కానీ ఈ ఆలయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ అప్పట్లో అక్కడ ఓ  నిర్మాణం ఉండేదని... అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: