కొద్ది దశాబ్దాల పాటు రగులుతున్న అయోధ్య భూవివాదం సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసిపోయింది. అయితే అయోధ్య  భూభాగంలో రామమందిరం నిర్మించాలని హిందువులు... బాబ్రీ మసీదు నిర్మించాలని ముస్లింల మధ్య తలెత్తిన వివాదానికి  సుప్రీంకోర్టు నేడు తెరదించింది. ఐదుగురు సభ్యులతో అత్యున్నత ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. భారత ప్రజలు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తీర్పు రానే  వచ్చింది. వివాదాస్పద అయోధ్య భూభాగం  ముస్లింలకు చెందుతుందని ముస్లిం సంస్థల నిరూపించుకోకపోవడంతో  భూభాగాన్ని హిందువులకి చెందిన  న్యాస్  సంస్థకు అప్పగించింది సుప్రీంకోర్టు. అంతేకాకుండా ముస్లింలు మసీదు నిర్మించుకునేందుకు ప్రత్యామ్నాయంగా సున్నీ వక్ఫ్  బోర్డు కి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. కాగా  రామమందిర నిర్మాణం కోసం కేంద్రం మూడు నెలల్లో ట్రస్టును ఏర్పాటు చేయాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం.కాగా  సుప్రీంకోర్టు తీర్పుపై హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ఎంతో పారదర్శకంగా ఉందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 



 కాగా  అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదే అంటూ న్యాస్  కి అప్పగిస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించిన  తరుణంలో దీనిపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకరి గెలుపు మరొకరి ఓటమిగా  చూడకూడదని నరేంద్రమోదీ సూచించారు. ఇది రామభక్తి... రహీం భక్తి కాదని... భారత భక్తి భావాన్ని బలోపేతం చేసిన సమయమిది అంటూ మోడీ పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరూ శాంతి,  సద్భావన ఐక్యమత్యంతో నిలవాలని మోడీ ప్రజలను కోరారు. చట్టాలకు లోబడి ఎలాంటి వివాదం అయినా  పరిష్కరించుకోవచ్చు ఆడడానికి అయోధ్య వివాదం  పరిష్కారమే అసలు సిసలైన ఉదాహరణ అంటూ ట్వీట్ చేసారు. 



 అయోధ్య భూవివాదం పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రత పారదర్శకత దూరదృష్టిని చాటి చెబుతోందని ప్రధాని మోడీ ప్రసంగించారు. చట్టం  ముందు అందరూ సమానమే అని చెప్పడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిదర్శనమని ప్రధాని వ్యాఖ్యానించారు. 130 కోట్ల మంది భారత దేశ ప్రజలు పాటిస్తున్న శాంతి సంయమనం విలువలకు సుప్రీంకోర్టు తీర్పు ఒక ప్రతీక అని ఆయన అన్నారు. ఈ ఐక్యత భావం దేశ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య వివాదానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సామరస్య ముగింపు ఇచ్చిందని మోడీ  అన్నారు. ఈ తీర్పుతో భారత న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచిందని ప్రధాని మోదీ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: