సుదీర్ఘ విచారణ తరవాత అయోధ్య వివాదం పై సుప్రీం కోర్టు తీర్పు ను వెలువరించిన నేపథ్యంలో ప్రముఖులు తీర్పు పై స్పందించారు. 
"రామ భక్తులైనా, రహీం భక్తులైనా.. దేశభక్తి భావనను పెంపొందించుకోవాలి. అప్పుడే శాంతి, సౌఖ్యాలు వర్థిల్లుతాయి. ఇది చరిత్రాత్మక తీర్పు. సహృద్భావ వాతావరణంలో ఈ సమస్య పరిష్కరించబడింది."- ప్రధాని నరేంద్ర మోడీ


"కలిసిమెలిసి జీవించాలన్న దేశ ప్రజల ఆకాంక్షల విజయమిది. ఈ సమున్నత భారత దేశంలో అందరికీ చోటుంది"-ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 
 ‘‘రామజన్మభూమి వివాదాస్పద స్థలంపై సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుని స్వాగతిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు కోర్టు తీర్పుని అంగీకరించాలి. ‘ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ భారత్‌’కి ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలి’’-కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా


"అయోధ్య కేసులో సుప్రీం తీర్పు చారిత్రాత్మకం. మతాలు వేరైనా మనమంతా రాముడి వారసులమే. సుప్రీం తీర్పుతో అయోధ్య వివాదాలన్నీపరిష్కారమైనట్టే. అ​యోధ్య వివాదంసై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలో శాంతి నెలకొనాల్సిన అవసరం ఉంది."-బాబా రాందేవ్


అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్వాగతించారు. ఈ తీర్పు ఏ ఒక్కరి విజయమో..ఓటమో కాదని వ్యాఖ్యానించారు. సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు పట్ల అందరూ శాంతి, సంయమనంతో వ్యవహరించాలని కోరారు. అయోధ్య కేసులో తీర్పు జాప్యమైనా తాజా తీర్పును స్వాగతిస్తామని అన్నారు. మసీదు, మందిరం పక్కనే ఉన్నా ఎలాంటి సమస్య ఉండబోదని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును అనుసరిస్తామని స్పష్టం చేశారు. 


"సుప్రీంకోర్టు తుది తీర్పు చాలా సంతోషం కలిగించింది. ఇక మూడు నెలల్లో రామమందిరం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలి"-ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త, రామ జన్మభూమి రథయాత్రలో కీలక పాత్రధారి కేఎన్‌ గోవిందాచార్య. "రామమందిర నిర్మాణం త్వరగా జరగాలి. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కరసేవకుల త్యాగం వృధాగా పోలేదు. రామమందిరం తో పాటు దేశం లో రామరాజ్యం రావాలి."-రాజ్ ఠాక్రే


మరింత సమాచారం తెలుసుకోండి: