130 కోట్లమంది గత నెల రోజులుగా ఎదురుచూస్తున్న తీర్పు ఈరోజు వెలువడింది.  14 లేదా 15 వ తేదీన తీర్పు వెలువడుతుంది అనుకున్నా.. ముందుగానే తీర్పును ప్రకటించింది సుప్రీం కోర్టు.  మొత్తం 1200 పేజీలతో కూడిన జడ్జిమెంట్ ఇది.  అత్యంత సున్నితమైన తీర్పును ఇవ్వడం అంటే మాములు విషయం కాదు.  చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం.  పైగా జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.  


అలా పరిశీలించి పరిశోధించి తీర్పు ఇవ్వాలి.  ఏదైనా తేడా వస్తే.. దేశంలో ఎన్ని గొడవలు వస్తాయో చెప్పక్కర్లేదు.  అయితే, సుప్రీమ్ కోర్టు దీన్ని మతపరమైన వివాదం కోసంములో కాకుండా ఓ భూమి విషయంలో ఉండే తీర్పుగా దీనిని తీసుకున్నది.  ల్యాండ్ విషయంలో తగాదాలు ఉన్నప్పుడు ఎలాగైతే పరిశీలించి పరిశోధన చేస్తారో.. అలానే ఈ విషయంలో కూడా కోర్టు పరిశీలించింది.  ఈ తీర్పు మొత్తం 2.77 ఎకరాల చుట్టూనే ఉన్నది. 


అయితే, 2..77 ఎకరాల వివాదాస్పద భూమి అయినప్పటికీ.. దానికి బలం చేకూర్చేలా.. రామ న్యాస్ అనే సంస్థ దాని చుట్టూ 42 ఎకరాలకు పైగా స్థలాన్ని కొనుగోలు చేసింది.  రామ జన్మభూమి ప్రాంతానికి బలం చేకూరాలి అంటే దాని అనుబంధంగా ఉండే భూమి కూడా ఉండాలి కాబట్టి ఎందుకైనా మంచిదిలే అని చెప్పి భూమిని కొనుగోలు చేసింది ఆ సంస్థ.  రామ జన్మభూమికి సంబంధించిన కేసు నడుస్తోంది కాబట్టి దానిని అనుబంధంగా ఉన్న ఈ స్థలం కూడా కోర్టులో ఉన్నది.  


ఈ స్థలం పై కూడా విచారణ జరిపారు.  2.77 ఎకరాల స్థలాన్ని కోర్టు అయోధ్య ట్రస్ట్ కు అప్పగించింది.  కానీ, ఈ 42 ఎకరాలు దీనికి సంబంధించిన మరికొంత భూమి విషయంపై మాత్రం ఎలాంటి తీర్పు ఇవ్వలేదు.  ఈ స్థలం ఎవరికీ ఇస్తుంది .. ఎలా ఆ భూమిపై సుప్రీం కోర్టు తీర్పు ఉన్నది అన్నది తెలియాల్సి ఉన్నది.  ఈ భూమికి సంబంధించిన వివరాలను కూడా కోర్టు తన తీర్పు ప్రతుల్లో పొందుపరిచే ఉంటుంది.  ఎవరికీ ఎలా ఇచ్చింది అన్నది ఆ ప్రతులు చూస్తూనే కానీ అర్ధం కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: