ఎస్పీజీ భద్రత ప్రధాని స్థాయి వ్యక్తులకు కల్పిస్తూ ఉంటారు.  ఎన్ఎస్జీ, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆ తరువాతి వాళ్లకు ఉంటుంది.  అయితే, 1991లో రాజీవ్ గాంధీ హత్య తరువాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.  సోనియా గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను ఏర్పాటు చేశారు.  రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా అదే ప్రొటెక్షన్ ఉంటుంది.  ఎస్పీజీ భద్రతను దాటుకొని ఎటాక్ చేయడం అంటే జరగని పని.  


ఈ ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు నిత్యం వాళ్లకు సంబంధించిన భద్రతను ఈ స్పెషల్ అధికారులు చూసుకుంటారు.  ప్రోటోకాల్ వ్యవస్థ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ వ్యవస్థను ఉల్లంఘించి వెళ్ళకూడదు.  దాని వలన ఏదైనా ప్రమాదం జరిగినా జరగొచ్చు.  కాగా, రీసెంట్ గా ఈ ఎస్పీజీ చట్టాన్ని మార్పులు చేసేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది.  ప్రధాని స్థాయి వ్యక్తులకు ఎస్పీజీ స్థాయి భద్రతను ఇవ్వాలని, మిగతా వాళ్లకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తే సరిపోతుందని కేంద్రం భావిస్తోంది.  


సోనియా గాంధీ కుటుంబానికి ఈ ఎస్పీజీ భద్రతను తొలగించడంతో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోంది.  వారి భద్రతను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.  ఇదిలా ఉంటె, గత కొన్నాళ్లుగా గాంధీ కుటుంబీకులు ఈ భద్రతా నియమాలను ఉల్లంఘిస్తున్నారు. భద్రతా సిబ్బందికి వారు సహకరించడం లేదు. 2015 నుంచి మే 2019 వరకు రాహుల్‌ 1,892 సార్లు నియమాలను ఉల్లంఘించినట్టు అధికారులు చెప్తున్నారు.  


బుల్లెట్‌ రెసిస్టెంట్‌ వాహనాన్ని తిరస్కరించి దిల్లీలో సంచరించారు. ఇక 250 సార్లు నాన్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో దిల్లీ బయట ప్రయాణించారు 1991 నుంచి 156 విదేశీ ప్రయాణాలు చేయగా.. అందులో 143 సార్లు ఎస్పీజీ అధికారులు లేకుండానే వెళ్లారు. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ ఇద్దరూ కలిసి 389 సార్లు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు లేకుండా ప్రయాణించారని అధికారులు చెప్తున్నారు.  మొత్తంగా రాహుల్ గాంధీ 1892 సార్లు ఎస్పీజీ భద్రత చట్టాన్ని ఉల్లంఘించినట్టు అధికారులు చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: