సకల జనుల సామూహిక దీక్ష హైదరాబాద్ లో రసాభాసగా మారింది. ఛలో ట్యాంక్ బండ్ పిలుపు మేరకు రాష్ట్రం నలుమూల నుంచి ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున హైదరాబాద్ కు చేరుకున్నారు.  ట్యాంక్ బండ్ పై లాంగ్ మార్చ్ చేసేందుకు సిద్ధం అయ్యారు.  ట్యాంక్ బండ్ వైపు వచ్చే అన్ని ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  బారీకేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు.  అంతకు ముందు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  


జేఏసీ పిలుపు మేరకు వేలాదిమంది కార్మికులు హైదరాబాద్ కు తరలివచ్చారు.  ట్యాంక్ బండ్ వద్ద ఇప్పుడు ఉద్రిక్తకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.   ఎక్కడికక్కడ కార్మికులను అడ్డుకుంటున్నా.. తప్పించుకొని భారీకేడ్లు దాటి, ముళ్ల కంచెలు దూకి ట్యాంక్ బండ్ వైపు పరుగులు తీసుకున్నారు.  బారీకేడ్లు దాటే సమయంలో చాలామందికి గాయాలయినట్టు సమాచారం.  


ట్యాంక్ బండ్ వైపు వస్తున్న కార్మికులను అడ్డుకొని వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.  దాదాపు ఇప్పటి వరకు 300 మందికి పైగా కార్మికులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.  ఈ చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులు, ఓయూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, విపక్ష నేతలు మద్దతు ఇచ్చాయి.  వీరంతా రోడ్డుపైకి వచ్చాయి.  కాగా, గత 36 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నారు.  సమ్మె చేస్తున్నా ప్రభుత్వం వీరి డిమాండ్ల గురించి ఆలోచించడం లేదు.  


అంతేకాదు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరని పని అని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.  ఆర్టీసీ లాసుల్లో ఉందని చెప్తూ వస్తున్నది.  ఆర్టీసీ లాస్ కు కార్మికులే కారణం అని ఒక వాదనను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది.  నష్టాల్లో ఉన్నప్పుడు సంస్థకోసం ఎక్కువగా పనిచేయాల్సింది పోయి ఇలా సమ్మెకు దిగడం సరికాదని చెప్పింది.  ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నది.  నవంబర్ 11 వ తేదీన ఈ కేసుపై హైకోర్టు ఒక నిర్ణయం తీసుకోబోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: