ఆధార్ అనేది ఇప్పుడున్న పరిస్దితుల్లో మన దేశంలో ప్రతి వ్యక్తి కలిగి ఉండాల్సిన గుర్తింపు కార్డు. ఆధార్ కార్డు లేదంటే కొన్ని ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. అంతగా ఇది మన జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చేసింది. ఇకపోతే ఇల్లు మారినప్పుడల్లా ఆధార్, ఓటర్ ఐడి తదితర గుర్తింపు కార్డుల్లో అడ్రెస్ కూడా మార్చుకోవడం తప్పనిసరి.


అయితే మిగతా గుర్తింపు కార్డుల సంగతేమోగానీ.. ఆధార్ కార్డు వివరాలు మాత్రం ఇకమీదట ఎప్పుడుపడితే అప్పుడు, ఎన్నిసార్లంటే అన్నిసార్లు మార్చుకోవడం అసలు కుదరని పని. ఈ విషయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.


ఇందుకు గాను యూఐడీఏఐ తాజాగా ఆధార్ అప్‌డేట్ నిబంధనలను పూర్తిగా మార్చేసింది. పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి అంశాలకు సంబంధించి రూల్స్ కూడా మారాయి. దీనివల్ల ఇప్పటి నుండి ఆధార్ సమాచారాన్ని మార్చుకోవడం అంత సులువు కాదు. వీటికి కూడా పరిమితులు ఉన్నాయి.


అవేంటంటే ఆధార్ కార్డులో ఇప్పుడు పేరును కేవలం 2 సార్లు మాత్రమే మార్చుకొనే వీలు ఉందట. ఇకపోతే ఆధార్ కార్డులో పుట్టిన తేదీని కేవలం ఒకేసారి మాత్రమే మార్చునే ఛాన్స్ ఉందట. అలాగే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో తొలిసారిగా రికార్డైన పుట్టిన సంవత్సరానికి మూడేళ్లు పైకి లేదా కిందకు మాత్రమే మార్చుకోవాలని అంటున్నారు.


ఇకపోతే పుట్టిన తేదీ మార్చుకోవడానికి కచ్చితంగా డాక్యుమెంట్ ప్రూఫ్ కావాలట. లేదంటే మార్చుకోవడం వీలు కాదని చెబుతున్నారు..ఇవేగాక జెండర్ వివరాలను కూడా కేవలం ఒకేసారి అప్‌డేట్ చేసుకోవాలట. ఇక ఆధార్ వివరాలలో అడ్రెస్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్, బయోమెట్రిక్స్ వంటి వివరాల మార్పు విషయానికొస్తే.. వీటిని ఇదివరకటి మాదిరిగానే ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. దీనికోసం ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా చూపించాల్సిన అవసరం లేదు.


అలాగే ఆధార్ కార్డుపై మీ ఫొటోను కూడా ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు అని అధికారులు తెలిపారు.. ఈ ఆధార్ వివరాలు నమోదు చేసుకోవాలంటే  ఆన్‌లైన్‌లోగాని లేదా ఆఫ్‌లైన్‌లోగాని మార్చుకోవచ్చు. లేదంటే సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి కూడా వివరాలు మార్చుకోవచ్చు. అయితే ఆధార్ సెంటర్‌‌లో వివరాలను మార్చుకోవాలనుకుంటే మాత్రం జీఎస్టీ అదనంగా చెల్లించి రూ.50 ఫీజు చెల్లించి మార్చుకోవచ్చూ.


ఇక లిమిట్ దాటి మార్పు చేసుకోవాలంటే యూఐడీఏఐ రీజినల్ ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే పరిమితి దాటిన తర్వాత కూడా మళ్లీ ఆధార్ అప్‌డేట్‌ ఎందుకు అవసరమైందో తెలియజేస్తూ help@uidai.gov.in కు మెయిల్ పంపాలి. మీరు చెప్పిన రీజన్‌కు రీజినల్ ఆఫీస్ ఓకే చేస్తే.. మీ రిక్వెస్ట్ ఎన్‌లోన్‌మెంట్ సెంటర్‌కు వెళ్లిపోతుంది. ఆధార్ వివరాలు అప్‌డేట్ అవుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: