ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజలకు మెరుగైన విద్యను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి సంచలనం సృష్టించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రతి పేద విద్యార్థి పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలి అనే  ముఖ్య ఉద్దేశంతో అమ్మ ఒడి పథకం ద్వారా  ప్రతి ఏడు  15 వేల రూపాయల చేయూతను  అందించేందుకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది . ఇక తాజాగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ ఉద్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు మాధ్యమం ఎంతైనా అవసరమని పేద విద్యార్థులకు కూడా ఇంగ్లీషు మాధ్యమం  అందించడం వల్ల అభివృద్ధి చెందుతారని జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలోనే రెండు దశల వారీగా 1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ను  మన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 



 అయితే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనపై ఏపీ లో దుమారం రేగుతోంది. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాడం  నిర్ణయంపై అటు ప్రతిపక్షాలే  కాదు ప్రజాసంఘాలు విద్యావేత్తలు తెలుగు పండితులు సైతం మండిపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వల్ల  తెలుగుభాష కనుమరుగయ్యే పరిస్థితి ఉందంటూ  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో  ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం  ప్రవేశపెట్టాలన్న  నిర్ణయంపై జగన్ సర్కార్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. విద్యా  శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలిదశలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు మాత్రమే ఇంగ్లీషు మాధ్యమాన్ని అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. 



 అంతే కాకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఆంగ్ల  భాషకు సంబంధించి ల్యాబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసారు. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కి ల్యాబ్  ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే తొలి దశలో 1 నుంచి ఆరో తరగతి వరకు మాత్రమే ఇంగ్లీషు మాధ్యమం అందుబాటులో ఉంచడానికి  సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్  ఆదేశించారు. కాగా నవంబర్ 14న ప్రకాశం జిల్లాలో నాడు-నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఒంగోలు కొత్తపట్నం లోని పలు పాఠశాలను సందర్శించి మౌలిక  సదుపాయాలను పరిశీలించనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అనంతరం ఒంగోలులోని పివిఆర్ బాలుర పాఠశాలలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: