మూడు పదుల సంవత్సరాల నుంచి సుప్రీం కోర్ట్ లో  విచారణ జరుగుతున్న అయోధ్య భూవివాదం పై నేడు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. గత 30 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో వాయిదా పడుతూ వస్తున్న అయోధ్య వివాడానికి నేడు తెరపడింది . ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత న్యాయస్థానం అయోధ్య  వివాదంపై తుది తీర్పును వెలువరించింది. కాగా  అయోధ్య భూవివాదంపై  సుప్రీమ్ కోర్టు తీర్పుపై హర్షద్వానాలు  వ్యక్తమవుతున్నాయి. ఎంతో పారదర్శకంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వివాదాస్పద అయోధ్య విభాగం తమదేనంటూ ముస్లిం సంస్థలు నిరూపించుకోకపోవడంతో... ఈ వివాదాస్పద భూమి హిందువులకు చెందిన న్యాస్ కి  అప్పగిస్తు  తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. 



 కాగా  ముస్లింలకు మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే  ఐదు ఎకరాల భూమిని సున్ని  వక్ఫ్  బోర్డుకి కేటాయించాలని సూచించింది. అంతేకాకుండా రామమందిరం నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు  చేయాలని కేంద్రానికి  సూచించింది సుప్రీంకోర్టు. కాగా  సుప్రీంకోర్టు తీర్పుపై సున్ని వక్ఫ్ బోర్డు  తన నిర్ణయాన్ని మార్చుకుంది. కాసేపటి క్రితమే  సుప్రీం కోర్టు తీర్పు రివ్యూ పిటిషన్ కు వెళ్లాలా వద్దా అనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుందామనుకున్నా సున్నీ వక్ఫ్  బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ కు వెళ్లాలనే  నిర్ణయం ఉపసంహరించుకుంది సున్ని వక్ఫ్ బోర్డు. అంతకు ముందుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సున్ని వక్ఫ్ బోర్డు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేసారు . సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సున్ని వక్ఫ్  బోర్డ్ లాయర్ జాఫర్ యాబ్ జిలాని...  దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామన్నారు . 



 సుప్రీం ఇచ్చిన ఐదు ఎకరాల భూమి మాకు అత్యంత ముఖ్యమైనది కాదని  తెలిపిన సున్ని వక్ఫ్ బోర్డు  తరపు న్యాయవాది... తీర్పులు అనేక అంశాలు ఉన్నాయన్నారు. శాంతి నెలకొల్పాలనే తాము కూడా భావిస్తున్నామని... సుప్రీంకోర్టు తీర్పు అంశంలో ప్రతి అంశాన్ని వ్యతిరేకించడం లేదు కానీ కొన్ని అంశాలపై మాత్రం తమకు అభ్యంతరం  ఉందని  చెప్పారు.ఇదిలా ఉండగా    సుప్రీంకోర్టు తీర్పు స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ... అయోధ్య తీర్పు విషయంలో పారదర్శకంగా సుప్రీమ్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చిందని  అభిప్రాయం వ్యక్తం చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: