తమ కుటుంబానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరిస్తున్నట్లు వార్తలు వస్తుండంతో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బలగాల కోసం ఓ భావోద్వాకమైన ట్వీట్ చేసాడు. 


'స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సిబ్బంది గా ఉండి నన్ను , నా కుటుంబాన్ని రక్షించేందుకు అంకిత భావంతో, చాలా సంవత్సరాలు నిర్విరామ కృషి చేసిన నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లమ్మలకు చాలా పెద్ద థాంక్స్. మీతో గడిపిన ప్రేమతో కూడిన ప్రయాణంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మీతో ప్రయాణం గర్వించదగినది', అంటూ తన ట్వీట్ ద్వారా వారికి అల్ ది బెస్ట్ చెప్పాడు రాహుల్.


నిజానికి రాహుల్ నానమ్మ.. మాజీ ప్రధాని అయినా ఇందిరా గాంధీ హత్యకు గురికావడంతో... ఎస్పీజీ భద్రతను కేవలం ప్రధాన మంత్రులను కాపాడడం కోసం 1985 లో ఏర్పాటు చేశారు. కానీ 1991 లో రాహుల్ తండ్రి ప్రధాని అయినా రాజీవ్ గాంధీ కూడా హత్యకు గురవ్వడంతో... గాంధీ కుటుంబానికి ప్రాణహాని ఉందని వాళ్ళనంతా కాపాడవలసిందిగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అంటే గత 28 సంవత్సరాలు గా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సిబ్బంది గాంధీ ఫ్యామిలీ ప్రాణాలను కాపాడుతూ వచ్చింది. అందుకే వారికి బిగ్ థాంక్స్ చెప్పాడు రాహుల్.. 


ప్రస్తుతం గాంధీ కుటుంబానికి ఏ ప్రాణహాని లేదంటూ ఎస్పీజీ భద్రతను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్ కే సి వేణుగోపాల్ మీడియా తో మాట్లాడుతూ.. బీజేపి ప్రభుత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జీవితాలతో ఆడుకుంటుంది అని....మోదీ అమిత్ షా వ్యక్తిగత కక్షలతోనే  ఎస్పీజీ భద్రతను తొలగించారని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: