తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. నేటితో ఆర్టీసీ సమ్మె 36 రోజులకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులు తమ భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా నేడు చలో ట్యాంక్ బండ్  కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాగా  ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన చలో ట్యాంక్ బండ్  కార్యక్రమానికి పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించారు. కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం చలో ట్యాంక్ బండ్  కార్యక్రమం  చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్ దగ్గర పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి  పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ ఆర్టీసీ కార్మికులు అందరూ భారీ మొత్తంలో  ట్యాంక్ బండ్ వద్ద కు చేరుకున్నారు . కాగా  పోలీసులు మూడంచల రక్షణ   చర్యలు చేపట్టారు. అయినప్పటికీ పోలీసులను  దాటుకుంటూ ట్యాంక్ బండ్ పైన కి ఆర్టీసీ ఉద్యోగులు దూసుకుపోతున్నారు. 



 అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో  ఆర్టీసీ కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ట్యాంక్ బండ్ పై  మొత్తం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇదిలావుండగా ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం హైకోర్టు కు సమర్పించాల్సిన   నివేదికపై ఈ సమీక్ష సమావేశంలో ఆర్టీసీ అధికారులు రవాణా శాఖ మంత్రితో కేసీఆర్  చర్చిస్తున్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం ఆర్టీసీలోని కొన్ని రూట్లను  ప్రైవేటీకరణ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా దానిపై విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. 



 అయితే ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసిఆర్ ఇప్పటివరకు చాలా సార్లు సమీక్షలను నిర్వహించారు  కానీ ఇప్పుడు వరకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కార పై  మాత్రం ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.అటు  ఆర్టీసీ కార్మికులు కూడా  ప్రభుత్వం తమ డిమాండ్లను  పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. కాగా నేడు ఒక వైపు కెసిఆర్ సమీక్ష నిర్వహించి హై కోర్టుకు సమర్పించిన నివేదికపై చర్చిస్తుంటే...  మరోవైపు ఆర్టీసీ కార్మికులు చలో టాంక్ బండ్  పేరుతో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు.దీంతో  ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీసులు మూడంచెల భద్రత చర్యలు చేపట్టినప్పటికీ  అవి ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమాన్ని ఆపలేక పోతున్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: