ఆర్టీసీ కార్మికుల సమ్మె నానాటికి బలపడుతూ పార్టీ నేతల నుంచి కూడా మద్దతు కూడగట్టుకుని సీఎం కేసీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా టిఆర్ఎస్ పార్టీ చెందిన రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కేసిఆర్ కు ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి లేఖ రాశారు. ఆ లేఖలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె గురించి వివరిస్తూ వారితో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సమ్మె ద్వారా ప్రభుత్వానికి చాలా నష్టం జరిగిందని... బాధిత కుటుంబాలు కూడా నష్టపోయానని ఇకనైనా ఈ సమస్యకు ముగింపు పలకాలని కేసీఆర్ ను సలహా ఇచ్చారు.

అయితే టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నేతల సూచనలు ,సలహాలు తీసుకోవడం ఏమాత్రం ఇష్టంలేనట్టు ముఖం చిట్లిస్తున్నరట. దీంతో పార్టీలో విభేదాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. అలాగే డి శ్రీనివాస్ పార్టీని వీడే సూచనలు కూడా మెండుగా ఉన్నాయని సమాచారం. డి శ్రీనివాస్ ఇంకా ఆ లేఖలో ఆర్టీసీ కార్మికులకు భరోసానిస్తూ మళ్లీ వారిని విధుల్లోకి తీసుకోవాలని మరియు వారి డిమాండుని పూర్తి చేస్తూ ఎటువంటి విభేదాలు లేని ఒక మంచి వాతావరణాన్ని అందివ్వాలని కోరారు. అలాగే ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుకు చేసిందని శ్రీనివాస్ కొనియాడారు.

డి శ్రీనివాస్ ఇప్పటికే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఇప్పుడు ఈ లేఖ రాయడం పార్టీలో చర్చనీయాంశమైంది. పరిస్థితిని చక్కదిద్దడానికి ఈ విషయాన్ని కే.కేశవరావు దృష్టికి కూడా శ్రీనివాస్ తీసుకువెళ్లడంట. అయితే కెసిఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరూ నోరు మెడపట్లేదంట. ఇలా టిఆర్ఎస్ పార్టీలో డి శ్రీనివాస్ ఒకటే కాకుండా ఇంకా కొందరు మంత్రులు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుస్తుండటంతో కెసిఆర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయడంట. శ్రీనివాస్ టి.ఆర్.ఎస్ పార్టీ వీడి బీజేపీ లో చేరే ఆలోచలనలో ఉన్నారంటూ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ఎందుకంటే పార్టీ ఈ రోజు ఉన్నంత బలంగా రేపు ఉండదు కానీ ప్రజలకు తమ పై అభిప్రాయం పైనే నాయకుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కదా. ఆర్టీసీ కార్మికులనే తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్న కేసీఆర్ కు ఇప్పుడు అక్కడున్నది పవర్ లో ఉన్న మంత్రులు కావడంతో అతని కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: