అయోధ్య వివాదానికి దాదాపుగా తెరపడినట్టే అనుకోవచ్చు.  దాదాపుగా 500 ఏళ్లకు పైగా వివాదాస్పద భూమిలో మీర్ అనే వ్యక్తి నిర్మించిన బాబ్రీ మసీద్ 1992 డిసెంబర్ 6 వ తేదీన కరసేవకులు నేలమట్టం చేశారు.  బాబ్రీ మసీద్ కట్టిన చోట అంతకు ఓ గుడి ఉండేదని, ఆ గుడిని కూల్చి దాని ప్లేస్ లో బాబ్రీ మసీద్ ను నిర్మించారని ఎప్పటి హిందువుల వాదన.  ఈ విషయంపై సుప్రీం కోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది.  


అందుబాటులో ఉన్న రికార్డులతో పటు భారతీయ పురాతత్వ శాఖ సమన్వయంతో కోర్టు ఈ కేసును పరిశీలించింది.  సుప్రీం కోర్టు అన్ని విషయాలను పరిశీలించిన తరువాతే ఈరోజు తీర్పును వెలువరించింది. హిందూ దేవాలయాన్ని కూల్చి దానిపై బాబ్రీ మసీద్ ను నిర్మించారు అని చెప్పేందుకు సాక్ష్యాలు లేవు. అదే సమయంలో బాబ్రీ మసీద్ ఉన్న చోట అంతకు ముందు హిందూలకు సంబంధించిన నిర్మాణం ఉన్నది.  


ఆ నిర్మాణంపైనే దీనిని నిర్మించారు అన్నది వాస్తవం.  బాబ్రీ మసీద్ నిర్మించినప్పటికీ ఆ ప్రాంతాన్ని హిందువులు, ముస్లింలు ఇద్దరు వాడుకున్నారు.  అప్పట్లో దీనిపై ఎలాంటి ఇష్యూ లేదు.  1950 కి ముందు వరకు అక్కడ ఎలాంటి ఇష్యూ లేదు.  1950 తరువాతే దీనికి సంబంధించిన వివాదం బయటకు వచ్చింది.  ముఖ్యంగా 2.77 ఎకరాలకు సంబందించిన భూమి తాలూకు విషయం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.  


ఈరోజు తీర్పు రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా వచ్చింది. ఈ తీర్పుపై  సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.  సుప్రీం కోర్టు అత్యున్నత న్యాయ స్థానం.. కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పింది.  అలానే, కోర్టు తీర్పును గౌరవిస్తూనే.. ఇచ్చిన తీర్పుపై అసంతృప్తిగా ఉన్నామని చెప్పింది.  కానీ, రివ్యూ పిటిషన్ వేయడం లేదని, అలాంటి ఉద్దేశ్యం లేదని  సున్నీ వక్ఫ్ బోర్డు స్పష్టం చేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: