సమాజంలో రోజురోజుకూ దొంగల బెడద ఎక్కువ అవుతూ వస్తుంది . తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా అని వినూత్నంగా ఆలోచించి  దొంగలుగా మారిపోతున్నారు చాలామంది . ఇక దొంగతనం చేయడంలో కూడా డిఫరెంట్ స్టైల్ చూపిస్తున్నారు. ఇక ఒక్కసారి దొంగతనానికి వచ్చారంటే అందినకాడికి దోచుకుంటున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి ఇంట్లో నుండి అందరు ఎప్పుడు  బయటకు వెళ్తున్నారు అనేది పూర్తిగా తెలుసుకున్నాక రంగంలోకి దిగుతున్నారు దొంగలు. దొంగలు కలిసి కలిసి  గ్రూపులుగా ఏర్పడి ఒకేసారి గట్టిగా  దోచుకుంటారు. అంతా బాగానే ఉందని బయటికెళ్లిన వాళ్ళు  వచ్చి చూసిన  ఇంట్లో దొంగతనం జరిగిందని తెలిసి లబోదిబోమంటున్నారు . 



 అయితే సిద్దిపేట జిల్లా లో దొంగలు పడ్డారు. అయితే దొంగలు పడటం కామన్  అంటారా కానీ ఇక్కడ మాత్రం ఒక ఇంట్లో దొంగతనం కాదండోయ్ ఏకంగా 14 ఇళ్లల్లో ఒకే రాత్రి దొంగతనం చేశారు. కొంత మంది దొంగలు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ముందు దొంగతనం చేయాలనుకున్న ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత దొంగతనం ప్లాన్ చేసి పకడ్బందీగా దొంగతనం చేసి 14 ఇళ్లను గుల్ల చేసారు . ఏకంగా సిద్దిపేట జిల్లాలోని 14 ఇళ్లలో దొంగతనం చేశారు ఈ గజ దొంగలు. అదికూడా  మామూలుగా కాదండోయ్  అందినకాడికి పూర్తిగా దోచుకుపోయారు. సిద్దిపేట జిల్లాలో ఒకే రాత్రి 14 ఇళ్లల్లో దొంగతనం చేసిన  గజదొంగలు అందినకాడికి దోచుకు పోవడంతో అక్కడి ప్రజలే కాదు పోలీసులు కూడా షాక్ కి గురయ్యారు. 



 సిద్దిపేట జిల్లాలోని ఘణపూర్ లో రెండు ఇళ్లలో దొంగతనం చేసిన దొంగలు... గోవర్ధనగిరి లో  మూడు ఇళ్లలో  దొంగతనం చేశారు. ఇక తిమ్మాపూర్ లో ఒక ఇంట్లో గుడికందుల గ్రామంలో ఏకంగా ఎనిమిది ఏళ్లలో దొంగతనం చేశారు. ముందుగా రెక్కీ నిర్వహించిన గజదొంగలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. Ee ఘటనతో  ఒక్కసారిగా సిద్దిపేట జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఒకేసారి 14 ఇళ్లలో దొంగతనాలు జరగడంతో షాక్ కి గురయ్యారు. కాగా  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే  సిసి టీవీ  రికార్డింగ్ లో ఆరుగురు దొంగలను గుర్తించామని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: