హైదరాబాద్ నగరంలో బాక్స్ కనపడితే చాలు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లో జరుగుతున్న అడపా దడపా పేలుళ్లు ప్రజలను బేంబేలెత్తిస్తున్నాయి. అనుమాదాస్పదంగా రోడ్లపై పడిన వస్తువులు పేలుళ్లకు ఎక్కువగా కారణమవుతున్నాయి. పోలీసులు కెమికల్ బ్లాస్ట్ అంటూ తేలికగా తీసుకుంటున్నారే తప్ప ఆ పేలుళ్ల వెనుక ఉన్న అసలు కారణాలను కనిపెట్టలేకపోతున్నారని జనాలు ఆరోపణలు చేస్తున్నారు. 
 
హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో చిత్తు కాగితాలు ఏరుకొనే వ్యక్తి తనకు దొరికిన ఒక బాక్స్ ను రాయితో కొట్టగా పెద్ద శబ్దంతో ఆ బాక్స్ పేలి చిత్తు కాగితాలు ఏరుకొనే వ్యక్తి ముక్కలు ముక్కలు అయ్యాడు. సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులను గతంలో జరిగిన ఈ ఘటన పరుగులు పెట్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఆ తరువాత పోలీసులు కెమికల్ బ్లాస్ట్ అయి ఉండవచ్చని భావించారు. 
 
ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత మల్కాజిగిరిలో ఒక చిన్నారి ఆడుకుంటూ ఇంట్లోకి వచ్చింది. ఆ పాప చేతిలో ఉన్న బాక్స్ పేలడంతో పెద్ద శబ్దం వచ్చింది. చిన్నారి తండ్రికి, చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన బాధితులను ఆస్పత్రికి తరలించి కెమికల్ బ్లాస్ట్ అయి ఉండవచ్చని భావించారు. తాజాగా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన మరోసారి జనాలను బెంబేలెత్తించింది.
 
ఇద్దరు చిత్తు కాగితాలు ఏరుకొనే మహిళలు తమకు దొరికిన ఒక బాక్స్ ను నేలకేసి కొట్టగా పెద్ద శబ్దంతో బాక్స్ పేలింది. బాధిత మహిళలు ఇద్దరూ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నారు. పొలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనను కూడా కెమికల్ బ్లాస్ట్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: