అయోధ్య భూవివాదంపై శనివారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సందర్భంగా అయోధ్య తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి సాయంత్రం ఆరుగంటలకు ప్రసంగం ప్రారంభించారు. ఇకపోతే అయోధ్య భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మాట్లాడుతూ అయోధ్య తీర్పును దేశమంతా స్వాగతించిందని అన్నారు.


అంతే కాకుండా అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎవరి విజయం కాదు. అలా అని ఎవరి ఓటమి కాదు.  భారతదేశ శాంతి, ఐక్యత, సద్భావన, గొప్ప సంప్రదాయాన్ని ఈ తీర్పు మరింత బలోపేతం చేయాలి. దేశ ప్రజలంతా శాంతి, సద్భావనతో మెలగాలని కోరుకుంటున్నాను. న్యాయవ్యవస్థ పట్ల  గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయి.


గతంలో సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను అన్ని పార్టీలు స్వాగతించాయి. కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్  దేశం అంతా కలసిమెలసి నిలబడదామని  ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు.. ఇకపోతే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే.. దేశంలో అనేక చోట్ల వీ హెచ్ పీ, బజరంగ్ దళ్ వంటి హిందూ సంఘాల నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు.


అంతే కాకుండా పలు చోట్ల బీజేపీ కార్యకర్తలు తమ మద్దతుదారులతో వీధుల్లో ఊరేగింపులు నిర్వహించారు. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రధాని మోదీకి రాజకీయ విజయమని కమలనాథులు అభివర్ణించారు. ఇన్నేళ్ళుగా ఎడతెగని వివాదానికి మోదీ ప్రభుత్వం విజయవంతంగా ముగింపు పలికిందని వారు వ్యాఖ్యానించారు. ఇకపోతే తీర్పునకు ముందు కోర్టు ప్రాంగణం దేశీ, విదేశీ జర్నలిస్టులతో నిండిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: