దేశంలోనే తీర్పు వెలువడేందుకు ఎక్కువ సమయం తీసుకున్న కేసుల్లో రెండవ కేసుగా గుర్తింపు తెచ్చుకున్న అయోధ్య వివాదం నేటితో సద్దుమణిగింది అనే చెప్పాలి. కరెక్టుగా చెప్పాలంటే ఒక వర్గం ప్రజలు ఈ నిర్ణయం పట్ల తీవ్ర హర్షం వ్యక్తం చేస్తుండగా మరొక వర్గం లో కొంతమంది మద్దతు పలుకగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే తీర్పు ఎలా ఉన్నా సాధారణంగా ఈ తరహా వివాదాలను రాజకీయ నాయకులు ఎక్కువగా తమ స్వలాభం కోసం వాడుకుంటారు. సుప్రీంకోర్టు తీర్పు కన్నా వీరు మాట్లాడే మాటల కోసం ప్రజానీకం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది.

ఇప్పుడు మోడీ సుప్రీంకోర్టు అయోధ్య కేసుకు సంబంధించి ఇచ్చిన తీర్పుపై జాతినుద్దేశించి మోడీ మరికొద్ది సేపట్లో ప్రసంగం చేశారు. అయితే కోర్టు తీర్పు వెలువడేందుకు ముందు మోడీ దేశాన్ని ఉద్దేశించి ముందే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తీర్పు ఎలా ఉన్నా కోర్టు యొక్క గౌరవాన్ని కాపాడడం ముఖ్యమని ఆయన అన్నాడు. అయోధ్య తీర్పు పట్ల వివిధ సంఘాలు చూపించిన నిగ్రహం అభినందనీయమని కొనియాడారు. అలాగే ఇదే నిగ్రహాన్ని మరియు సామరస్యాన్ని తీర్పు వెలువడిన తర్వాత కూడా చూపాలని మోడీ దేశ ప్రజలను ప్రధాని మోడీ కోరారు. అలాగే సుప్రీం కోర్టు తీర్పు దేశంలో ఐక్యత, విగ్రహం మరియు శాంతిని నెలకొల్పుతుందని ఆశావాహం కూడా వ్యక్తం చేశారు. 

ఇప్పుడు తీర్పు వెలువడిన తర్వాత మోడీ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ నవ భారత్ ను నిర్మిద్దాం రండి అంటూ ప్రజలను ఆహ్వానించాడు. ఈ తీర్పు భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని, ఇది భారతీయులందరి విజయమని అన్నారు. అలాగే నవంబర్ 9వ తేదీ చరిత్రలో మిగిలిపోయే రోజు అని... ఈ దీర్ఘకాలిక సమస్య పై తీర్పు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఇలా మోడీ మొదటి నుండే దేశంలో శాంతిభద్రతల కొనసాగాలని ఉద్దేశించి మాట్లాడుతూ రావడం నిజంగా అభినందనీయం.


మరింత సమాచారం తెలుసుకోండి: