మంచి మనసు ఉంటే ప్రజలకు మేలు చేసే మార్గాలు అనేకం ఉంటాయి. అదే విధానంలో ఏపీ సీఎం జగన్ మొహాన్ రెడ్డి దూసుకుపోతున్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే ప్రజలకు మేలు చేసే పథకాలు అమలు చేస్తూ వారి మద్ధతు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, డ్వాక్రా మహిళలకు రుణాలు, రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు సాయం, అమ్మఒడి లాంటి పథకాలు అమలు చేసి అన్నీ వర్గాల ప్రజలని ఆకట్టుకున్నారు.


ఇక తాజాగా అగ్రిగోల్డ్ బాధితులకు ఆర్ధిక సాయం చేసి వారి మద్దతు కూడా కూడబెట్టుకున్నారు. అయితే అగ్రిగోల్డ్ బాధితులకు టీడీపీ ఐదు సంవత్సరాల పాటు న్యాయం చేయలేక చేతులెత్తిసిన విషయం తెలిసిందే. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే వారికి అండగా నిలిచారు. రూ. 10 వేలలోపు డిపాజిట్లు ఉన్న 3.70లక్షల మంది బాధితులకు న్యాయం చేశారు. వారిని ఆదుకునేందుకు రూ. 264 కోట్లు విడుదల చేశారు.


ఈ డ‌బ్బుతో త్వరలోనే రూ.20 వేలు డిపాజిట్లు ఉన్నవారికి సాయం చేయనున్నారు. అలాగే మిగతా వారికి సాయం అందించనున్నారు. ఇప్పుడు రూ. 10 వేలు లోపు ఉన్నవారికి ఒక్కసారే ఎమౌంట్ బాధితుల ఎకౌంట్లోకి వేశారు. దీంతో డబ్బులు వచ్చిన ప్రతి బాధితుడు ఆనందం వ్యక్తం చేశారు. జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. దాదాపు 3.70 లక్షల మంది సంతోషం వ్యక్తం చేయడం మామూలు విషయం కాదు.


అగ్రిగోల్డ్ బాధితులు అంతా దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన వారే. వారంతా రెక్క‌ల క‌ష్టంతో సొమ్ము దాచుకున్నారు. ఇప్పుడు నాలుగేళ్లుగా న‌ర‌క‌యాత‌న అనుభ‌వించిన వీరిలో ఎక్కువ శాతం ఒక్కసారిగా జగన్ పట్ల పాజిటివ్ గా మారిపోయారు. ఇప్పటికే చాలా వర్గాల మద్ధతు కూడబెట్టుకున్న జగన్ కు అగ్రిగోల్డ్ బాధితుల మద్ధతు దొరకడం వల్ల...ఆయన బలం మరింత రెట్టింపు అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: