అయోధ్య తీర్పు.. ఈరోజు హాట్ టాపిక్ అంటే ఇదే.. కారణం 15 శతాబ్దాల నుండి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అయోధ్య వివాదానికి ఈరోజు తెర పడింది. అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం తీర్పును స్వాగతించిన నరేంద్ర మోదీ ఈరోజు సాయింత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు.

               

అయోధ్య తీర్పు న్యాయవ్యవస్థలో చారిత్రాత్మకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నూతన భారత్‌ నిర్మాణానికి సుప్రీంకోర్టు తీర్పు నాంది అని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా వస్తున్న ఈ అయోధ్య వివాదానికి నేటి తీర్పుతో శాశ్వతంగా ముగింపు పలకడం చాల ఆనందంగా ఉందని మోదీ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పును దేశమంతా స్వాగతిస్తోందని, ప్రపంచానికి మనదేశ గొప్పతనం తెలిసిపోయిందని మోదీ అన్నారు. 

               

కాగా 'నవంబర్‌ 9 ఎంతో చారిత్రాత్మకమైన రోజు.అని అయోధ్యపై సుప్రీంకోర్టు మహోన్నతమైన తీర్పును వెలువరించింది. తీర్పును ఎవరూ గెలుపోటములుగా చూడవద్దని తీర్పును స్వాగతించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని, ప్రజలు చాలా సంయమనం పాటించారు. భారత న్యాయవ్యవస్థపై అంతర్జాతీయంగా ప్రశంసలు వస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారత్‌. భిన్నత్వంలో ఏకత్వానికి నేటి పరిస్థితే నిదర్శనం' అని ప్రధాని నరేంద్ర మోదీ గొప్పగా ప్రసంగించారు. 

                 

కాగా అందరూ ఐకమత్యంగా కలిసి ఉండే సమయం అని, కొత్త ప్రారంభానికి శ్రీకారం చుడదాం అని మోదీ అన్నారు. నవ భారతాన్ని నిర్మిచుకుందాం, అందరినీ కలుపుకొనిపోతూ అందరి అభివృద్ధి కోరుతూ మనం ముందుకు సాగుదాం అంటూ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: