ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ త‌న పార్టీ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఎన్నికల్లో వైసీపీ గెలుపుకి ప్రధాన కారణాలు జగన్ పాలనపై ప్రజలకు ఉన్న అంచనాలే ప్రధాన కారణం. ఆయన ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనలపై ప్రజలు ఎన్నో ఆశాలుపెట్టుకుని ఆయన గెలిపించి ముఖ్యమంత్రిని చేసారు. ఆయన మొహం చూసే ప్రజలు ఎమ్మెల్యేలను గెలిపించారనేది వాస్తవం. మరి ఎమ్మెల్యేల తీరు ఏ విధంగా ఉంది...? ఇప్పుడు దీనిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


గత౦లో తెలుగుదేశం తరహాలోనే ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. పదేళ్ళ పాటు పార్టీకి అండగా నిలిచామని ఇప్పుడు కూడా వ్యాపారాలు చేయకపోతే ఎలా అనే భావన వారిలో ఉండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు వచ్చింది.


స్థానిక నేతలు జగన్ వద్దకు నేరుగా ఈ సమస్యను తీసుకువెళ్ళారు. ఇక కొందరు సీనియర్ అధికారులు కూడా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉండటం లేదనే విషయాన్ని జగన్ కి చెప్పారు. ప్ర‌కాశం, చిత్తూరు, ఉత్త‌రాంధ్ర‌, అనంత‌పురం జిల్లాల‌కు చెందిన ఎమ్మెల్యేల మీదే ఈ కంప్లెంట్లు ఎక్కువుగా వ‌చ్చాయ‌ట‌. దీనితో ఇటీవల జగన్ కొంత మంది ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీస్ కి పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట.


నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లేకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇదే కొనసాగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాల్సి ఉంటుందని చెప్పారట. వారంలో రెండు రోజులు వ్యాపారాల మీద, మిగిలిన రోజులు నియోజకవర్గాల్లో ఉండాలని, విపక్షానికి నియోజకవర్గంలో అవకాశం ఇస్తే పరిస్థితులు నా చేతుల్లో కూడా ఉండవని చెప్పారట. ఇక కొంత మంది ఎమ్మెల్యేలకు అయితే తేడా వస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే వార్నింగ్ ఇచ్చారట జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి: