అయోధ్య వివాదం శతాబ్దాలుగా కొనసాగుతున్న యుద్దం లాంటి పోరాటం. ఎన్నాళ్లకు తెగుతుందో తెలియని ఆందోళనలో ఇంతకాలం ప్రతి వ్యక్తి ఎదురు చూసిన ఈ పోరు ఇన్నాళ్లకు ముగిసింది. అయోధ్య పై సుప్రీంకోర్టు శనివారం కీలకమైన తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించడం విశేషం.


తొలుత వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖాడా పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాదాంశమని. యాజమాన్య హక్కులనేవి నిర్ధేశిత న్యాయ సూత్రాల ప్రకారం నిర్ణయిస్తామని చీఫ్ జిస్టిస్ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ఇకపోతే ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారని, రెండు మతాలు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు జరిగేవని తెలిపారు.


రాముడు అయోధ్యలోనే జన్మించాడని ముస్లింలు కూడా అంగీకరిస్తారన్నారు. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని, వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందు నిర్మాణం ఉందని పురావస్తు విభాగం కూడా చెబుతోందన్నారు. ఇకపోతే ఈ నవంబర్ 9 చరిత్రలో మిగిలిపోయే రోజు. ప్రతి భారతీయుడు గర్వించదగిన రోజు. ఈ తీర్పు మనుషుల మధ్య ఇంకా బందాలను పెంచాలి హిందు ముస్లీం భాయ్ భాయ్ ఇది ఎప్పటికి సత్యం. ఈ నిజాన్ని ఇలాగే అందరు కలసి కట్టుగా బ్రతికించాలి.


ఇకపోతే ఈ అయోధ్య తీర్పు కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది ధర్మాసనం. ఇకపోతే అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పును స్వాగతిస్తూ.. శనివారం సాయంత్రం మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.


అయోధ్య తీర్పు న్యాయవ్యవస్థలో చారిత్రాత్మకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నూతన భారత్‌ నిర్మాణానికి సుప్రీంకోర్టు తీర్పు నాంది అని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా వస్తున్న వివాదానికి నేటి తీర్పుతో శాశ్వతంగా ముగింపు పలికిందని మోదీ అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పును దేశమంతా స్వాగతిస్తోందని, ప్రపంచానికి మనదేశ గొప్పతనం తెలిసిపోయిందని అన్నారు. ‘నవంబర్‌ 9 ఎంతో చారిత్రాత్మకమైన రోజు అని పేర్కొన్నారు...


మరింత సమాచారం తెలుసుకోండి: