ఆంధ్రప్రదేశ్ లో పాలన ఇప్పుడు ఇప్పుడే గాడిన పడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన మీద పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. సీనియర్ అధికారుల సలహాలు, కీలక నిర్ణయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆర్ధిక శాఖ విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి ? సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చెయ్యాలి ? ఏయే వాటికి ఎంత వరకు నిధులు ఖర్చు చెయ్యాలి ? సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి ? రాజకీయంగా విమర్శలు రాకుండా సంచలన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి ? అనే వాటి మీద ఆయన కష్టపడుతున్నారు.


ఇక్కడే కొంత మంది మంత్రుల తీరు జగన్ కి చికాకు తెప్పిస్తుందని పరిశీలకులు అంటున్నారు. కొంత మంది అధికారులు జగన్ కు మంత్రులపై ఇటీవల తరుచుగా ఫిర్యాదు చేస్తున్నారట. ఒక శాఖా మంత్రి అయితే కనీసం సచివాలయానికి చుట్టం చూపుకి కూడా రావడం లేదనే విషయాన్ని అధికారులు జగన్ కు చెప్పారు. దీనితో ఆయన సదరు మంత్రిగారిని పిలిచి సచివాలయంలో కొన్ని ఫైళ్ళ గురించి అడగగా మంత్రిగారు నీళ్ళు నమిలారట.


దీంతో జగన్ మంత్రి సచివాలయానికి వచ్చిన తేదీని ప్రస్తావించి మళ్ళీ ఎప్పుడు వస్తారని అడిగారట. దీనికి మంత్రిగారు తెల్ల మొహం వేసే సరికి జగన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట, ఇక మరికొంత మంది మంత్రులు అయితే హైదరాబాద్ లో ఎక్కువ ఉంటున్నారనే విషయం జగన్ కు అధికారుల నుంచి తెలియగా వారిని పిలిచి మాట్లాడి... ఇంకోసారి హైదరాబాద్ వెళ్తే ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని స్ప‌ష్టంగా చెప్పేశార‌ట‌.


ఇక శాఖల్లో అలసత్వం ప్రదర్శిస్తే మీ స్తానంలోకి మరొకరు వస్తారని. విపక్షం విమర్శల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా సూచించారట జగన్. ఇక మరికొంత మంది శాఖ‌ల్లోనూ, పార్టీ సిద్ధాంతాల ప‌రంగాను పెంచుకోవడం లేదని అధికారుల నుంచి ఫిర్యాదులు రాగా... వారికి జగన్ పిలిచి మ‌రీ క్లాస్ పీకారట.


మరింత సమాచారం తెలుసుకోండి: