చలో ట్యాంక్ బండ్ లో దారి తీసిన ఉద్రిక్త పరిస్థితులపై నగర పోలీసు విభాగం సంచలన ఆరోపణలు చేసింది. ఆర్టీసీ కార్మికులు మావోయిస్టులతో చేతులు కలిపారని సీపీ అంజనీ కుమార్ అన్నారు. మావోయిస్టులతో కలిసి ఆర్టీసీ కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వటం వలన ఏడుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. మావోయిస్టులు ఎంటర్ అవుతున్నారని సమాచారం రావటంతో చలో ట్యాంక్ బండ్ కు అనుమతి ఇవ్వలేదని అన్నారు. 
 
ఆరీసీ కార్మికులు, మావోయిస్టులు కలిసి పోలీసులపై రాళ్లు రువ్వారని ట్యాంక్ బండ్ ముట్టడికి పోలీసులు అనుమతి ఇవ్వలేదని అంజనీ కుమార్ అన్నారు. నిన్న సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అప్పీల్ కూడా జరిగిందని చలో ట్యాంక్ బండ్ కు అనుమతి ఇవ్వమని చెప్పామని అంజనీ కుమార్ అన్నారు. ఈరోజు భారీ సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు, మావోయిస్టులు రాళ్లు రువ్వి దాడులు చేయటంతో పోలీసులకు గాయాలయ్యాయని అన్నారు. 
 
ఇందులో సీనియర్ ఆఫీసర్లు శ్రీధర్ ఏసీపీ చిక్కడపల్లి, కానిస్టేబుల్ ఆఫీసర్ రాజు క్విక్ రియాక్షన్ టీమ్ కు, సబ్ ఇన్ స్పెక్టర్ మోత్గురు శేఖర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర రాళ్లు రువ్వటంతో గాయలపాలయ్యారని అంజనీకుమార్ చెప్పారు. అడిషనల్ డీసీపీ రామచందర్, ఏసీపీ రత్నం, సైదిరెడ్డి గాయాలపాలయ్యారని అంజనీ కుమార్ చెప్పారు. మావోయిస్టు సంబంధాలు ఉన్న యూనియన్లతో ఆర్టీసీ కార్మికులు చర్చలు జరపటంతో పోలీసులు అనుమతి నిరాకరించగా ఈరోజు మావోయిస్టుకు సంబంధిన అనుబంధ సంఘాలు పోలీసులపై రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. 
 
దాడి చేసిన వారిపై 5 కేసులు పోలీసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రాళ్లు విసిరిన వ్యక్తులను పోలీసులు గుర్తించారని సాక్ష్యాల ఆధారంగా కేసులు నమోదు చేశారని తెలుస్తోంది. అనుమతి ఇవ్వకపోయినా చేపట్టిన చలో ట్యాంక్ బండ్ లో కొంతమంది ఆర్టీసీ కార్మికులకు కూడా గాయాలయినట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: