అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై చిక్కుముడి వీడిపోయింది. కొన్ని దశాబ్దాలకు పైగా రగులుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడింది. గత 30 సంవత్సరాలుగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో  విచారణ వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో తాజాగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని  ఐదుగురు సభ్యులు అయోధ్య వివాదాస్పద స్థలం పై సంచలన తీర్పును వెలువరించారు. అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించారని ముస్లింలు... లేదు రామమందిరం నిర్మించాలి అని హిందువులు మధ్య ఏర్పడిన వివాదానికి సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పుతో ముగింపు పలికినట్లయింది . అయితే భూభాగం తమకు సంబంధించిందని ముస్లిం సంస్థలు నిరూపించుకోకపోవడంతో...వివాదాస్పద అయోధ్య భూభాగాన్ని హిందువులకు చెందిన న్యాస్ సంస్థకు  అప్పగిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కాగా అయోధ్య లో  రామమందిర నిర్మాణం కోసం అయోద్య ట్రస్ట్   ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.



 అంతేకాకుండా బాబ్రీ మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూభాగాన్ని కేటాయించాలని ఈ కేటాయింపు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. సున్ని వక్ఫ్ బోర్డుకు ఈ భూభాగాన్ని అంద  చేయాలని తెలిపింది. కాగా అయోధ్య  వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైనది. మూడు దశాబ్దాల కాలంగా  సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ నేటితో ముగిసినట్లయింది. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమి హిందువులకు  రామమందిర నిర్మాణానికి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై దేశ ప్రజలందరి హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరువర్గాలను  దృష్టిలో పెట్టుకుని సంచలన తీర్పును సుప్రీంకోర్టు వెలువరించినది  అంటూ దేశ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 



 ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు చరిత్రలోనే ఇలాంటి తీర్పు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏదైనా తీర్పును వెలువరించిన అప్పుడు ఆ తీర్పు రాసిన జడ్జి  పేరును ప్రస్తావిస్తారు కానీ. తాజాగా అయోధ్య  వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లో మాత్రం జడ్జి  పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు. అసలు తీర్పు ప్రతుల్లోనూ  న్యాయమూర్తి పేరు లేదు. అయితే ఇప్పుడు వరకు సుప్రీం కోర్టు వెలువరించిన అన్ని తీర్పుల్లో  తీర్పు రాసిన జడ్జి  పేరు క్లుప్తంగా వివరించారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే మొదటిసారిగా ఒక జడ్జి పేరు ప్రస్తావించకుండా తీర్పు వెలువరించడం ఇదే  మొదటిసారే. ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేరిట తీర్పు వెలువడింది. 1045 పేజీల తీర్పులో నూట పదహారు పేజీల ప్రత్యేక అనుబంధాన్ని పొందుపరిచారు. ఈ  అనుబంధంలో పూర్తిగా రామజన్మభూమి పై హిందువుల విశ్వాసాలను ప్రస్తావిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: