అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై చిక్కుముడి వీడిపోయింది. కొన్ని దశాబ్దాలకు పైగా రగులుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడింది. గత 30 సంవత్సరాలుగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో  విచారణ వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో తాజాగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని  ఐదుగురు సభ్యులు అయోధ్య వివాదాస్పద స్థలం పై సంచలన తీర్పును వెలువరించారు.అయితే భూభాగం తమకు సంబంధించిందని ముస్లిం సంస్థలు నిరూపించుకోకపోవడంతో...వివాదాస్పద అయోధ్య భూభాగాన్ని హిందువులకు చెందిన న్యాస్ సంస్థకు  అప్పగిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 


 కాగా  ఉత్తరప్రదేశ్లోని అయోధ్య భూభాగం  వివాదంపై నేడు సుప్రీం కోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో... ఉత్తరప్రదేశ్ తో పాటు ఢిల్లీ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా హైఅలర్ట్ ప్రకటించింది కేంద్రం. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరించినప్పటికి ఎక్కడ అవాంఛనీయ ఘటనలు అల్లర్లు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది . సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ అంత టెన్షన్ టెన్షన్ గా మారిపోయింది . ఈ క్రమంలో వివాదాస్పద అయోధ్య  కేసుపై ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి అంతా  ప్రశాంతంగానే ముగిసిపోయింది . అయితే సుప్రీంకోర్టు తీర్పు పై స్పందించిన ఉత్తరప్రదేశ్ బిజెపి ఓపి సింగ్ మీడియాతో మాట్లాడారు.



 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు భద్రత చర్యలు చేపట్టి భారీ స్థాయిలో బలగాలను మోహరించడం తోనే రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు సాధ్యమైందని డీజీపీ  ఓపి సింగ్ మీడియాతో తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో శాంతిభద్రతలు పై తాము  ఎంతగానో అప్రమత్తంగా ఉంన్నామంటూ  తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి చోటా సిబ్బంది క్షణక్షణము పరిస్థితులను సమీక్షించి ముందుకు సాగారని డీజీపీ ఓపి సింగ్  తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని  అయోధ్య భూభాగం పై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయని ముందస్తు సమాచారం మేరకే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి అత్యవసర ఆపరేషన్ కేంద్రం  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో సిఆర్పిఎఫ్,  ఆర్పిఎఫ్,  ఎస్ఎస్బీ,  ఐటిబిపి, సిఐఎస్ఎఫ్, జీఆర్పీ  బలగాలు అవిశ్రాంతంగా పనిచేసాయని తెలిపారు . ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఏర్పాట్లను సమీక్షించారని తెలిపిన డీజీపీ ఓపీ సింగ్...  ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని  తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: