అప్పట్లో ఉత్తర భారతాన్ని పరిపాలించిన బాబర్ కోసం అయన సేనాని మీర్ బాఖీ అయోధ్యలో బాబ్రీ మసీద్ ను నిర్మించాడు.  ఈ నిర్మాణం అయోధ్యలో నిర్మించే సమయంలో అక్కడ ఓ పురాతనమైన హిందువులకు సంబంధించిన కట్టడం ఉన్నది.  ఆ కట్టడంపైనా బాబ్రీ మసీద్ ను నిర్మించారు.  బాబ్రీ మసీద్ నిర్మాణంలో ఆ పురాతన కట్టడానికి సంబంధించిన కొన్ని శిధిలాలను వినియోగించుకున్నారు.  ఆ శిధిలాలను బట్టి అది హిందువుల కట్టడంపై కట్టినట్టుగా తెలుస్తోంది. 


1528లో బాబ్రీ మసీద్ ను నిర్మిస్తే.. దానికి సంబంధించిన మొదటి కేసు 1885లో ఫైజాబాద్ కోర్టులో దాఖలైంది.  మహంత్ రఘువీర్ దాస్ కేసు వేయగా,ఆ కేసును కోర్టు కొట్టివేసింది.  ఇప్పుడు అక్కడ రామ్ మందిరం నిర్మాణానికి అనుమతి ఇస్తే.. మతపరమైన వివాదలకు బీజం వేసినట్టు అవుతుందని చెప్పి కొట్టివేసింది.  అయితే, 1949లో రామ్ లల్లా, సీత రసోయి విగ్రహాలు మసీద్ లోపల వెలిశాయి.  అలా మసీద్ లోపల ఈ విగ్రహాలు వెలిసిన తరువాత వివాదం పెరిగింది.  


ఈ విగ్రహాలను హిందువులే పెట్టారని ముస్లింలు వాదించడం మొదలుపెట్టారు. 1949లో విగ్రహాలు వెలిసిన తరువాత 1950 లో పూజలు చేసుకునేందుకు అనుమతించాలని గోపాల్ సిమ్లా విశారథ్, పరమహంసా రామచంద్రదాస్.. ఫైజాబాద్ జిల్లా కోర్టులో దావా వేశారు.  ఈ కేసు ఫైజాబాద్ కోర్టులో నడిచింది.  ఇక 1986 తరువాత చాలా మార్పులు వచ్చాయి.  1986 ఫిబ్రవరి 1 వ తేదీన స్థానిక కోర్టు ఓ తీర్పును ఇచ్చింది.  ముస్లింలతో పాటుగా హిందువులు కూడా లోపల పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.  


దీని తరువాతే అంటే 1992 డిసెంబర్ 6 వ తేదీన బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగింది.  ఈరోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో బాబ్రీ మసీద్ కూల్చివేత రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది.  రాజ్యాంగ బద్దంగా విరుద్ధం అన్నప్పుడు.. బాబ్రీ మసీద్ కూల్చివేతకు పాల్పడిన వ్యక్తుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే వ్యక్తులపైనే చర్యలు తీసుకుంటారా లేదంటే సంస్థలపై కూడా చర్యలు తీసుకుంటారా అన్నది చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: