రెవిన్యూ డిపార్ట్మెంట్ మీద కొన్ని రోజుల నుంచి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు తహసీల్దారు హత్య ఘటన చోటు చేసుకున్న తరువాత కేసీఆర్ రెవిన్యూ వ్యవహారంలో ఆచి తూచి వ్యవహరించాల్సిన పరిస్థితి. అదే విషయాన్ని కేసీఆర్ తమ ఎమ్మెల్యేలకు చెప్పుకొచ్చారు. తాజాగా తెలంగాణాలో జరిగిన తహసీల్దార్ దారుణ హత్య తరువాత ..రెండు తెలుగు రాష్ట్రాలలో తహసీల్దార్ లు వణికిపోతున్నారు. ఈ ఘటన జరిగిన తరువాత చాలా చోట్ల .. తమ సమస్యలని పరిష్కరించకపోతే పేట్రోల్ పోసి నిప్పు పెడతాం అని కానీ పెట్రోల్ పోసుకొని ఆఫీస్ లోనే ఆత్మహత్య చేసుకుంటాం అని బెదిరించే వారు బాగా ఎక్కువైపోయారు. దీనితో తహసీల్దార్ లు తమకి ప్రభుత్వం సెక్యూరిటీ ఏర్పాటు చేయాలనీ కోరుకుంటున్నారు.


అయితే కెసిఆర్ తమ ఎమ్మెల్యేలను భూమికి సంభందించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పినట్టు సమాచారం. రెవెన్యూ ఇష్యూస్కు దూరంగా ఉండండి.. రియల్ ఎస్టేట్ జోలికి వెళ్లొద్దు .. భూమి పంచాయతీల్లో తల దూర్చకండి .. తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి తాజాగా ఎమ్మెల్యేలకు వెళ్లిన సూచనలు ఇవి. తహశీల్దార్ విజయారెడ్డి హత్య తర్వాత భూమి అంశాలు సీరియస్గా మారాయి. సోషల్ మీడియాలో రెవెన్యూ డిపార్ట్మెంట్కు పాజిటివ్ నెగెటివ్గా వాదనలు జరుగుతున్నాయి.


దీనితో కేసీఆర్ అప్రమత్తమై ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యేలకు ముందస్తు వార్నింగ్ ఇచ్చారు. సాధారణంగా ఎమ్మెల్యేల వద్దకు భూమికి సంబంధించిన ఫిర్యాదులు లేకపోతే…రెవెన్యూ శాఖకు సంబంధించిన కంప్లెంట్లు ఎక్కువగా వస్తాయి. ప్రజల్లో రెవెన్యూ శాఖ పై ఉన్న కోపం ఎమ్మెల్యేల పైకి మళ్లితే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని గమనించిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకి ఆదేశాలు జారీచేశారని తెలుస్తుంది. భూములకు సంబంధించిన వ్యవహారంలో ఎవరికి సహాయం చేసిన ఇంకొకరు శత్రువులు గా మారతారు. అందువల్ల ఇలాంటి ఇష్యూల్లో తలదూర్చక పోవడమే మంచిదని సీఎం నుంచి ఎమ్మెల్యేలకు సలహా వెళ్లిందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: