సరిగ్గా ఒక నెల రోజుల క్రితం ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా సెల్వమణి తెలంగాణ ముఖ్య మంత్రి అయినా కెసిఆర్ పై సంచనల వ్యాఖ్యలు చేసింది. చిత్తూరు జిల్లా లోని పుత్తూరు లో జరిగిన వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సమావేశంలో పాల్గొన్న రోజా...వై ఎస్ జగన్ హామీ ఇచ్చినా ప్రకారం ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేసారంటూ పొగుడుతూ... పక్క రాష్ట్రమైన తెలంగాణ ముఖ్య మంత్రి ఉద్యమం చేస్తున్నా ఆర్టీసీ కార్మికులను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారంటూ కెసిఆర్ ని విమర్శించింది. 


అయితే రోజా కెసిఆర్ ని విమర్శించినా రోజు నుంచి ఇప్పటివరకు ఆమెకి.. జగన్ కి మధ్య దూరం పెరుగుతున్నట్లు సమాచారం. కెసిఆర్ పై విమర్శలు చేసినందుకు జగన్ ఆమె పై ఆగ్రహించాడని దానితో రోజా తెలంగాణ గురించే మాట్లాడడం మానేసిందని సమాచారం. కొన్ని సామాజిక సమీకరణాల వల్ల రోజాకి మంత్రి పదవిని ఇవ్వలేక పోయారు సీఎం జగన్. అదే మొట్టమొదటి సారిగా రోజా జగన్ పై అలగడం. రోజాని బుజ్జగించడానికై ఆమెకు మంత్రి పదవితో సమానమైన ‘ఏపీఐఐసీ’ చైర్ పర్సన్‌గా నియమించాడు జగన్. కానీ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఈమె ఏపీఐఐసీ పదవిని అసంతృప్తి గానే చేస్తున్నారు. 


తాజాగా జగన్ లక్ష్మీ పార్వతి ని ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్‌గా నియమించడంతో రోజా కాస్తంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. 'అసలు నేను వైసీపీ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను ప్రతిపక్ష పార్టీ అయినా టీడీపీ పై గట్టిగ పోరాడి ప్రజలలో విరామం లేకుండా తిరిగాను. కానీ లక్ష్మీ పార్వతి వైసీపీ కోసం ఏం శ్రమపడలేదు.. అలాంటి ఆమెకు నాతో సమానమైన పదవిని ఇవ్వడం ఏంటి,' అంటూ రోజా చాలా అసంతృప్తిగా ఉన్నారని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: