బీజేపీ ఈ రోజు దేశంలో అతి పెద్ద పార్టీ, అంతర్జాతీయంగా కూడా ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్న పార్టీ. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక కేంద్రంలో బంపర్ మెజారిటీతో రెండవమారు అధికారంలోకి వచ్చింది. బీజేపీకి మోడీ లాంటి ఉక్కు మనిషి నాయకుడుగా ఉన్నాడు. అపర చాణక్యుడుగా అమిత్ షా ఉన్నారు. మరి ఇన్ని రకాలుగా ప్లస్ పాయింట్లు ఉన్న బీజేపీకి కొత్త కష్టం ఏమి వచ్చింది.


వచ్చిందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. సుప్రీం కోర్టు తీర్పు తరువాతనే ఇది వచ్చిందని కూడా వారు విశ్లేషిస్తున్నారు. సుప్రీం తీర్పుతో అయోధ్యలో రాముల వారి ఆలయం తలుపులు తెరచుకున్నాయని, అదే సమయంలో బీజేపీ తలుపులు పూర్తిగా  మూతపడతాయని వారు జోస్యం చెబుతున్నారు. కేవలం రామున్ని రాజకీయానికి వాడుకుని బీజేపీ ఇంతవరకూ వచ్చిందని కూడా కాంగ్రెస్ నేతలు అంటున్నారు.


బీజేపీ రాజకీయానికి ఇక చెల్లు చీటీయేనని కూడా అంటున్నారు.  కేవలం రెండు సీట్లతో ఉన్న బీజేపీ అయోధ్య రామున్ని అడ్డం పెట్టుకుని ఎదిగిందని, రాజకీయాల్లొకి దేవుడిని లాగేసిందని మండిపడుతున్నారు. తాము మాత్రం అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పుని మనస్పూర్తిగా బలపరుస్తున్నామని చెబుతున్నారు. ఇక రాముడు లేని బీజేపీకి ఇక్కట్లు తప్పవని కూడా అంటున్నారు. ఏ విషయాన్ని రెచ్చగొట్టి అయినా బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని కూడా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి కాంగ్రెస్ నేతలు అంటున్న మాటలు నిజమవుతాయా. ఎందుకంటే 2022 లో యూపీ ఎన్నికలు ఉన్నాయి.


ఈ లోగా రామమందిరం పూర్తి అయితే మళ్ళీ వచ్చే ఎన్నికలకు బీజేపీకి కొత్త నినాదం ఏముదన్నది ఒక ప్రశ్న అని రాజకీయ పండితులు అంటున్నారు. అయితే బీజేపీ తలచుకోవాలే కానీ ఏవైనా అంశాలు ముందుకువస్తాయని కూడా చెబుతున్నారు. ఇక మోడీ చరిస్మా ఇపుడు తోడుగా ఉంది కాబట్టి తమకు ఏ సమస్యలను అడ్డుపెట్టుకోవాల్సిన అవసరంలేద‌ని కూడా కమలనాధులు  చెబుతున్నారు. చూడాలి మరి ఎవరి వాదన కరెక్ట్ అవుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: