ఎప్పుడు జరిగేలానే.. ఓ నీచుడు ఓ మహిళను అత్యాచారం చేశాడు. అంతటితో ఆగలేదు ఆ నీచుడు.. ఆమె కూతురిని కూడా అనుభవించాలనుకున్నాడు.. తల్లి ఊరికే ఉంటుందా ? అతన్ని ఊరికే వదిలేస్తుందా ? చుక్కలు చూపించింది. ఎందుకు బతికానురా బాబు అనుకునేలా హింసించి చంపింది. 


ఎవరైనా సరే.. పిల్లలకు హాని తలిపెడుతారు అంటే చాలు. వారిని చంపి అయినా సరే పిల్లల్ని కాపాడుకుంటారు. అలానే ఓ మహిళా తన కూతురుని కాపాడుకోవాలని ఆ నీచుడుని గుండెల్లో కత్తితో పొడిచి.. రక్తం పోతున్న పట్టించుకోకుండా అతడి మెడకు తాడు బిగించి ఆ తాడును కారుకు కట్టేసింది. 


అనంతరం తన ఇంటికి సమీపంలో 2కిలోమీటర్ల దగ్గరలో ఉన్న కాలువ వద్దకు కారుతో ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ నీచుడు అక్కడే చచ్చిపోయాడు. అనంతరం ఆమె అతని డెడ్ బాడీని కాలువలో పడేసి ఇంటికి వెళ్ళింది. రెండు రోజుల తర్వాత అటుగా వెళ్తూన్నా ఓ జంట ఆ శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. 


దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ద్వారా ఆమెని పట్టుకున్నారు. అనంతరం ఆమెని కోర్టులో ప్రవేశపెట్టగా జరిగినది జరిగినట్టు అంత చెప్పింది. అయితే ఆమె చెప్పింది విన్న కోర్టు రేపిస్టు నుంచి ఆత్మరక్షణ కోసం పోరాడటంలో తప్పులేదు. కానీ, కత్తితో పొడిచిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, అతడిని కారుకు కట్టి ఈడ్చుకెళ్లి హత్యచేయడం అమానవీయమైన ఘటన అని ఆమెకి 9 ఏళ్ళు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ దారుణమైన ఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో చోటుచేసుకుంది. 


అయితే ఈ ఘటన గురించి తెలుసుకున్న కొందరు.. కన్నా కూతురు కోసం ఆ నీచుడుని హత్య చెయ్యడం తప్పు కాదు.. అలాంటి కామాంధులను ఆలా చంపడమే సరైనపని అని నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: