రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్ సర్కార్  మరోసారి రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చింది . సాగునీటి ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ కు వెళ్లిన జగన్ సర్కార్ , పెద్ద మొత్తం లో ప్రధానాన్ని ఆదా చేసిన విషయం తెల్సిందే . పోలవరం ప్రాజెక్టు పనుల్లో గత ప్రభుత్వానికి భిన్నంగా జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ కు వెళ్లి సంచలనాన్ని సృష్టించింది . ఇక తాజాగా    గ్రామ,  వార్డు వాలంటీర్లకు ఇచ్చే సిమ్ కార్డుల  కొనుగోలులో  జగన్  ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది.


  ఓపెన్ మార్కెట్ లో  నెలవారి పోస్ట్ పెయిడ్ చార్జీలు రూ. లు 199 ఉండగా,  రివర్స్ యాక్షన్ లో రూ.లు 92 .04 లకే సిమ్ కార్డు అందజేసే విధంగా  ఎయిర్ టెల్ బిడ్డింగ్  దక్కించుకుంది.  ఆంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీ టీఎస్) ద్వారా నిర్వహించిన టెండర్ ప్రక్రియ లో  పలు కంపెనీలు పోటీ పడ్డాయి.   ఈ నెల 6న ఏపీ టీఎస్ ఫైనాన్షియల్ బిడ్ ను  తెరిచింది. ఎల్ -1  గా నిలిచిన  కంపెనీ 4జీ సిమ్ లు  మూడేళ్లకుగాను  రూ.లు 121 . 54 కోట్లకు టెండరు దాఖలు చేసింది .


ఈ నెల 7 వతేదీన రూ.లు 121 . 54  తో జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లగా , ఎయిర్ టెల్ యాక్షన్ లో 87 .77 కోట్ల రూపాయలకు దక్కించుకుంది .   దీనితో రూ.లు 33 76 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కు  ఆదా అయినట్లయింది . నెలవారీ పోస్ట్ పెయిడ్ కార్డులు రూ. లు 92 .04 కు ఎయిర్ టెల్ సరఫరా చేసే విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకుందని ఏపీ టీఎస్ వెల్లడించింది .


మరింత సమాచారం తెలుసుకోండి: