మనిషి రెండు కాళ్లు పెట్టుకుని నాలుగు కాళ్ల జంతువుకంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు. మనిషిగా ఏనాడో తన సహజత్వాన్ని పోల్పోయి కౄరంగా జీవించడానికి సమాజంలో రోజు రోజుకు అలవాటుపడుతున్నాడు.  ఇకపోతే  నిజంగా ప్రేమించే హృదయాలకు మాత్రమే వివాహ బాంధవ్యానికి వున్న విలువ తెలుసుంది. ఇలాంటి వారి దృష్టిలో అది విడదీయరాని బంధంగా పెనవేసుకుంటుంది.. కేవలం ఒక అలవాటు వంటిదో, ఒక సౌకర్యం వంటిదో కాదు. అది శరీర సంబంధమైన, సెక్స్ సంబంధమైన అవసరాల మీద ఆధారపడినదని భావించరు.



ఏ నిబంధనలు లేని ఆ ప్రేమలో వ్యక్తిత్వాలు పూర్తిగా కలిసి ఒకటై పోతాయి. అటువంటి బాంధవ్యంలోనే వుపశాంతి లభిస్తుంది. ఆశ వుంటుంది. అయితే ఇప్పుడున్న చాలామంది వివాహా బాంధవ్యాల్లో యిటువంటి ఐక్యత కనిపించడం లేదు. వేరువేరుగా వున్న రెండు వ్యక్తిత్వాలు కలసి ఒకటై పోవాలంటే, మీమ్మల్ని మీరు తెలుసుకోవాలి, ఆమె తనని తాను తెలుసుకోవాలి. ఇదే వివాహజీవితం. ఇకపోతే అనవసర విషయాలపట్ల మనిషి ఎక్కువగా స్పందిస్తూ తోటివారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాడు. ఇలాంటి ఓ రాక్షసుడు కూడా ఇప్పుడు తన భార్యబిడ్డనే పొట్టన పెట్టుకున్నాడు. వివరాలు పరిశీలిస్తే...



రాచర్లకు చెందిన గుమ్ముళ్ల చిన్న పుల్లయ్య.. 2009లో లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. 2011లో పుట్టింటికి వెళ్లి రెండో సంతానానికి జన్మనిచ్చిన లక్ష్మీదేవి బాలింతగా ఉండగానే ఆమెపై అనుమానం పెంచుకుని.. కిరాతకంగా హత్యచేశాడు. ఈ కేసులో అప్పట్లో ఏడేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించి జైలు నుంచి విడుదలయ్యాక 2017లో వెఎస్సార్‌ జిల్లా రామాపురానికి చెందిన రమాదేవిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇక వీరికి ఎనిమిది నెలల కుమారుడు ఉన్నాడు.



ఇకపోతే ఇతనిలో మృగం మళ్లి నిద్దుర లేచింది. బిడ్డ పుట్టినప్పట్నుంచి తన పోలికలతో లేడని నిత్యం భార్యను వేధింపులకు గురిచేస్తూ ఉంటున్నాడట.. ఇదే విషయంపై శుక్రవారం రాత్రి మళ్లీ వేధించాడు. శనివారం ఉదయం కూడా భార్యతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంచంపై ఉన్న రేవంత్‌ను తీసుకుని నేలకేసి కొట్టాడు. అది చాలదన్నట్టు గొంతుపై కాలేసి తొక్కి హతమార్చాడు. కన్న బిడ్డను కళ్ల ముందే చంపేస్తుండటం చూసి హతాశురాలైన రమాదేవి కేకలు వేస్తూ ఇరుగు పొరుగును పిలిచింది.దీంతో మరింత రెచ్చిపోయిన పుల్లయ్య పక్కనే ఉన్న రోకలి బండ తీసుకుని ఆమె తలపై బలంగా మోదాడు.



తీవ్ర గాయాలతో ఆమె కేకలు వేస్తూ వీధిలోకి వచ్చి కుప్పకూలిపోయింది. ఇక పాపం ఆ పసి బిడ్డ అప్పటికే మరణించాడు. అది చూసి పుల్లయ్య అక్కడ నుంచి పరారయ్యాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి రక్తపు మడుగులో పడి ఉన్న రమాదేవిని ప్రవేటు ఆస్పత్రికి తరలించగా. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఇకపోతే రమాదేవి సోదరుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని అప్పగిస్తామని సీఐ సుధాకర్‌రావు చెప్పారు. ఈ సంఘటనను చూసిన ప్రజలు ఇతన్ని ఉరితీయాలని ఇలాంటి వాడివల్ల సమాజానికి మరింత ప్రమాదమని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: