సరిగ్గా 30 ఏళ్ల క్రితం నవంబర్ 9 వ తేదీన తూర్పు జెర్మనీ, పశ్శిమ జెర్మనీ దేశాలను విభజిస్తూ దాదాపు 48 వేల మైళ్ళ పొడవున ఎత్తైన గోడను నిర్మించారు. బెర్లిన్ లో కూడా ఈ గోడను నిర్మించారు.  అనేక సంవత్సరాలు ఈ అడ్డుగోడను తొలగించేందుకు పోరాటాలు జరిగాయి.  బెర్లిన్ లో ఈ గోడ పొడవునా నిత్యం పహారా ఉండేది.  ఎవరైనా సరే గోడ దూకాలని చూసేవాళ్లను దారుణంగా కాల్చి చంపేవారు.  దానిని నిరసిస్తూ తూర్పు, పశ్చిమ బెర్లిన్ లో ఎన్నో ఉద్యమాలు జరిగాయి.  ఆ ఉద్యమాల ఫలితంగా బెర్లిన్ గోడను కూల్చివేయాలని అనుకున్నారు.  


నవంబర్ 9 వ తేదీన ఈ బెర్లిన్ గోడను కూల్చివేశారు.  ఈ గోడను కూల్చివేయడాన్ని చారిత్రాత్మక అంశగా పేర్కొన్నారు.  ప్రపంచంలోనే అది అతిపెద్ద సంఘటనగా అప్పట్లో పేరు వచ్చింది.  ఇక నవంబర్ నెలలో ప్రపంచంలో అనేక గొప్ప గొప్ప సంఘటనలు కూడా జరిగాయి.  కొన్ని విషాదాలు కూడా జరిగాయి.  నవంబర్ 26 వ తేదీన ముంబైలో పాక్ నుంచి వచ్చిన కొంతమంది ముష్కరులు దాడులు చేసిన సంగతి తెలిసిందే.  ఈ దాడుల్లో అనేకమంది మరణించారు.  


ఇదిలా ఉంటె, ఇదే నవంబర్ లో ఇండియాలో మరో చారిత్రాత్మక సంఘటన జరిగింది.  అదే అయోధ్య తీర్పు.  1885 నుంచి అయోధ్య కేసులు కోర్టులో నలుగుతున్నాయి.  2019 లో అయోధ్య విషయంలో తుదితీర్పు వచ్చింది.  దాదాపు 134 సంవత్సరాలుగా దీనిపై కేసులు నడిచాయి. ఫైజాబాద్, అలహాబాద్, సుప్రీం కోర్టులో అయోధ్య గురించి కేసులు నడిచాయి.  ఈ మొత్తం కేసులు కేవలం 2.77 ఎకరాల స్థలం చుట్టూనే నడిచింది.  ఈ స్థలంలో మందిరం నిర్మించాలా లేదంటే మసీద్ నిర్మించాలా అనే అంశం చుట్టూనే నడిచింది.  


ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న కేసులో నవంబర్ 9 వ తేదీన తుదితీర్పు రావడం విశేషం.  నవంబర్ 9 వ తేదీన ఈ తీర్పు చెప్పడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి.  అందులో ఒకటి సెలవు.  నవంబర్ 9 రెండో శనివారం. చాలా వరకు ప్రభుత్వ, సాఫ్ట్ వేర్ కార్యాలయాలకు సెలవు ఉంటుంది.  ఆరోజు కోర్టులకు హాలిడే ఉంటుంది.  కాబట్టి రెండో శనివారం రోజును తీర్పును ప్రకటిస్తున్నట్టు అనూహ్యంగా అర్ధరాత్రి ప్రకటించి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: