పాకిస్థాన్ లో నిర్వహించిన కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత్ నుండి మాజీ క్రికెటర్, పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇమ్రాన్ పై సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. కారిడార్ నిర్మాణానికి లాభనష్టాలతో సంబంధం లేకుండా చొరవ చూపినందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ కు ధన్యవాదాలు తెలిపారు. కారిడార్ నిర్మాణంలో తన స్నేహితుడు ఇమ్రాన్ పాత్ర ఎనలేనిదని సిద్ధూ అన్నారు. 
 
ఇమ్రాన్ కొన్ని లక్షల హృదయాల్ని గెలుచుకున్నారని సిద్ధూ అన్నారు. సిక్కుల కలను నెరవేర్చిన రెండు దేశాల ప్రధానులకు సిద్ధూ ధన్యవాదాలు తెలిపారు. విభజన సమయంలో పాక్, భారత్ దేశాల మధ్య నెలకొన్న రక్తపాతానికి పంజాబ్ సాక్ష్యమని మోదీ, ఇమ్రాన్ కారిడార్ నిర్మాణంతో ఆయింట్ మెంట్ అనే పూత పూశారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీకు నాకు మధ్య రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చని కానీ కారిడార్ నిర్మాణానికి మోదీ చూపిన చొరవ మరవలేనిదని అన్నారు. 
 
నేను నా జీవితాన్ని గాంధీ కుటుంబానికే అంకితం చేసినప్పటికీ కారిడార్ కల నెరవేర్చినందుకు మున్నాభాయ్ ఎంబీబీఎస్ స్టైల్ లో ఒక హగ్ ఇస్తున్నా అని అన్నారు. కానీ ఇదే కార్యక్రమంలో పాక్ సెనేటర్ ఫైజల్ జావెద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్ స్నేహితుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ 9 టెస్ట్ సెంచరీలు సాధించాడని ఫైజల్ జావెద్ అన్నారు. కానీ పాకిస్థాన్ పై మాత్రం ఒక్క సెంచరీ కూడా సాధించలేదని అన్నారు. 
 
పాక్ ప్రధాని ఇమ్రాన్ పై ప్రేమ ఉండడం వల్లనే సిద్ధూ సెంచరీ సాధించలేదని అన్నారు. ఏడు టెస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన సిద్ధూ అత్యధికంగా 97 పరుగులు మాత్రమే సాధించాడని పాక్ సెనేటర్ గుర్తు చేశారు. భారతదేశంలోని పంజాబ్ లో ఉన్న డేరా బాబా నాయక్ గురుద్వారాతో పాకిస్తాన్ లోని పంజాబ్ లోని కర్తార్ పూర్ కారిడార్ అనుసంధానించారు. గురునానక్ 550వ జయంతి సందర్భంగా నరేంద్ర మోదీ ఈ కారిడార్ ప్రారంభించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: