విజన్.. అంటే భవిష్యత్ ప్రణాళిక.. ఈ దేశంలో విజన్ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చినవాళ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉంటారు. ఆయన 2004లోనే విజన్ 2020 ను కలగన్న నాయకుడు.. అయితే ఆయన విజన్ పై అనేక విమర్శలూ ఉన్నాయి. అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతారన్న విమర్శ ఉంది.


ఇందుకు మొన్నటి ఐదేళ్ల పాలనే ఉదాహరణ అంటున్నారు ఆయన్ను విమర్శించేవారు.. అమరావతి పేరుతో ఐదేళ్ల పాటు గ్రాఫిక్స్ చూపించి ఒక్క శాశ్వత నిర్మాణమూ కట్టకుండా కాలయాపన చేశారని మండిపడుతుంటారు. ఇకవారి సంగతి అలా ఉంచితే.. చంద్రబాబు విజన్ వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. ఓ సందేశాన్ని సర్క్యులేట్ చేస్తోంది..


ఇదీ ఆ సందేశం.

“ నీ విజన్ ఎంత గొప్పదో నీ కొడుకును చూస్తే తెలుస్తుంది.

నీ విజన్ ఏపాటిదో పోలవరం పనులు పడుకోబెట్టినప్పుడే అర్థం అయద్యింది.

నీ విజన్ వల్ల ఏం జరుగుతుందో దోమలపై దండయాత్ర చేసినప్పుడు చూసాం.

నీ విజన్ లో లాభం ఎవరికో అమాంతం పెరిగిన నీ హెరిటేజ్ ఆస్తుల విలువ చెప్పింది.

నీ విజన్ ఏమిటో తెలీకే నాడు ఎన్టీఆర్ దెబ్బైపోయాడు


నీ విజన్ గుర్తించకే తెలుగవారు 2014లో మోసపోయారు

నీ విజన్ తెలుసుకోలేకే మహా కూటమి మట్టిగొట్టుకుపోయింది

నీ విజన్ తెలిసి చీకట్లో చిదంబరానికి ఠారెత్తిపోయింది.

నీ విజన్ కు ఉదాహరణలు -

నకిలీ స్టాంపుల కుంభకోణం, వాటర్ షెడ్ పథకం, నీరూ మీరూ, మద్యం అక్రమాలు, సోమశిల భూముల కుంభకోణం, ఏలేరు కుంభకోణం, పీపీఏల్లో అవినీతి, ఏటీఎమ్ లా పోలవరం, విశాఖ భూములు, ఇసుక మాఫియా, కాల్ మనీ దందా అబ్బో ఒకటా రెండా??

నీ విజన్ విస్తరాకుల కట్టంత గొప్పది.

నీ విజన్ విసినికర్రంత ఉపయోగకరమైంది.

ఒప్పుకున్నాంగా....!!

- వైసీపీ సోషల్ మీడియా


మరింత సమాచారం తెలుసుకోండి: