మహారాష్ట్రలో ఎన్నికలు ముగిసి చాలా రోజులైంది.  ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు కాలేదు.  బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా ఉన్నది.  ఆ పార్టీకి 105 స్థానాలు ఉన్నాయి.  సెకండ్ ప్లేస్ లో ఎన్సీపీ, మూడు స్థానంలో శివసేన, నాలుగో స్థానంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి.  కూటమిలో భాగంగా బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి.  ఈ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.  


కానీ, శివసేన అధికారం బదలాయింపులో తనకు కూడా ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలని, ముఖ్యమంత్రి పీఠంలో శివసేన అభ్యర్థి కూడా కూర్చోవాలని వాదిస్తూ వచ్చింది.  కానీ, దానికి బీజేపీ ససేమిరా అనేసింది.  ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు ససేమిరా అన్నది.  ఉపముఖ్యమంత్రి, 13 మంత్రి పదవులు ఇస్తామని చెప్పింది.  దానికి బీజేపీ ససేమిరా అనడంతో అసలు కథ మొదలైంది.  


బీజేపీతో ఇక మాటల్లేవని చెప్పింది.  శివసేనకు 170 మంది మద్దతు ఉందని, శివసేన ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తుందని చెప్పింది.  కానీ, ఎన్సీపీ చుట్టూ తిరుగుతున్నా ఆ పార్టీ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు.  ఈ ఈవిషయాన్ని ఇప్పటికే తెగేసి చెప్పేసింది.  ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు లేకుండా శివసేన కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.  ఒకవేళ ఉప ముఖ్యమంత్రి పదవి చాలు అనుకుంటే బీజేపీతో చేతులు కలపొచ్చు.  


బీజేపీతో విడిపోయి కాంగ్రెస్, ఎన్సీపీతో కలవాలని చూస్తే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి గతి పట్టిందో అలాంటి గతి మహారాష్ట్రలో శివసేనకు రావొచ్చు.  ఇదిలా ఉంటె, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రావాలని బీజేపీని గవర్నర్ ఆహ్వానించారు.  ఈ ఆహ్వానం మేరకు బీజేపీ కూడా సిద్ధం అయ్యింది.  అయితే, సోమవారం రోజున సర్కార్ బలనిరూపణ చేసుకోవాలని చెప్పింది.  దానికి బీజేపీ సర్కార్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.  ఇన్ని రోజులు సాధ్యం కానిది, అయోధ్య తీర్పు వచ్చిన తరువాత బీజేపీ ఎలా సాధ్యం చేసి చూపిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: