వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అంటే ఓ ఇమేజ్ ఉంది. ఆయన చాలా మొండివాడని.. తాను ఏదైనా అనుకుంటే..ముందూవెనుకా ఆలోచించరని.. అంటుంటారు. కానీ అది తప్పని జగన్ మరోసారి నిరూపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8 తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉంటుంది. తెలుగు మీడియం ఉండదు.


అయితే ఈ నిర్ణయంపై కొన్ని పత్రికలు మండిపడ్డాయి. ముందస్తు సన్నద్ధత లేకుండా ఎలా తెలుగు మీడియం తీసేస్తారని విమర్శించారు. దీంతో వైఎస్ జగన్ ఈ నిర్ణయంపై పునరాలోచించారు. ఇప్పుడు దాన్ని కాస్త సవరించి.. వచ్చే ఏడాది నుంచి ఆరోతరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఆ తర్వాత దాన్ని పదో తరగతి వరకు తదుపరి విద్యా సంవత్సరాల్లో విస్తరిస్తారు. విమర్శలు లాగానే నిర్ణయాన్ని సమీక్షించుకుని సవరించుకోవడం ఏ నాయకుడికైనా మంచే చేస్తుంది.


విద్యాశాఖతో సమీక్ష నిర్వహించిన జగన్.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. నాడు – నేడులో భాగంగా ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని, బోధనలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విధానాలను పాటించాలని ఆదేశించారు. జగన్ వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడానికి తగిన కారణాలు ఉన్నాయి.


ఎందుకంటే.. రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య మొత్తంగా పరిశీలిస్తే 70,90,217 మంది విద్యార్థులు అక్టోబర్‌ వరకు నమోదయ్యారు. వారిలో 44,21,529 మంది అంటే 62.3 శాతం ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. వారిలో అత్యధికులు ఓసీలు.. మొత్తం 82.6 ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియం చదివే వారిలో ఎస్టీకి చెందిన విద్యార్థులు 33.23 శాతం మాత్రమే. ఎస్సీకి చెందినవారు 49.61 శాతం మాత్రమే. వెనుబడిన వారు 62.5 శాతం మాత్రమే.


ఆంగ్ల మాధ్యమంలో స్కూళ్లు అందుబాటులో లేకపోవడం, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు కేవలం ధనికులకు మాత్రమే పరిమితమైపోయింది. గ్రామీణ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీలు వెనుబడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లీష్ విద్య అత్యవసరం.


మరింత సమాచారం తెలుసుకోండి: