గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం తీరుపై జనం బాగా విసిగిపోయారు. అందుకే వైసీపీని బంపర్ మెజారిటీతో గెలిపించారు. తనపై జనం పెట్టుకున్న ఆశల గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు బాగానే తెలుసు. అందుకే తన ప్రయారిటీలు క్లారిటీగా వివరిస్తూ.. ఒక్కొక్కటిగా ఎన్నికల వాగ్దానాలు అమలు చేస్తూ పోతున్నారు.


ఇంతవరకూ బాగానే ఉంది.. కానీ కొందరు వైసీపీ నేతలు.. అప్పుడే తాము అన్నీ చేసేసినట్టు.. ఎన్నికల హామీలు అన్నీ తీర్చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ప్రజల ముందు చెబుతున్నారు. ద్రబాబు ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఐదు నెలల్లో చేసి చూపారని మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.


నరసాపురం పట్టణంలోని మేధర్ల వంతెన వద్ద శాసన సభ్యుడి నూతన కార్యాలయాన్ని రాష్ట్ర మత్స్య శాఖ, మార్కెటింగ్ , పశు సంవర్థక శాఖా మాత్యులు మోపిదేవి వెంకటరమణ, పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘు రామకృష్ణ రాజు , శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి వర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పాదయాత్రలో పామాయిల్ రైతులు తమ సమస్యలను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్పందించిన సీఎం వైయస్‌ జగన్‌ వ్యవసాయశాఖ మంత్రిని పంపించి.. దేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.


ఐదు నెలలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదంటూ చంద్రబాబు, లోకేష్‌ చెప్పే మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మె పరిస్థతిలో లేరని వారు పేర్కొన్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఐదు నెలల్లోనే అన్నీ చేసేశామని చెబుతూ పోతే జనం ఆగ్రహిస్తారు. గతంలో టీడీపీ ఇలాగే డప్పుకొట్టుకుని ప్రజాగ్రహం చవిచూసింది. ఇది వైసీపీ నేతలు కూడా గుర్తించుకుంటే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: