చంద్రబాబు ఐదేళ్ల పాలనపై వైసీపీ నేతలు ఎప్పటి నుంచో మండిపడుతున్నారు. చంద్రబాబు పాలన ఆసాంతం అవినీతి మయమని అంటున్నారు. అనడమే కాదు.. ఒక్కో విషయంపై ప్రత్యేకంగా విచారణ కమిటీలు కూడా వేశారు. కాకపోతే.. ఆ కమిటీలు ఇప్పటి వరకూ పెద్దగా తేల్చిందేమీ లేదు. కానీ ఆ నివేదికలు ఎప్పుడు వస్తాయో.. ఏం బాంబులు పేలుస్తాయో అని జనం ఎదురు చూస్తున్నారు.


కానీ.. ఈ లోపు వైసీపీ మంత్రులు మాత్రం చంద్రబాబు పాలన అవినీతిపై ప్రకటనలు మాత్రం ఆపడం లేదు. టీడీపీ హయాంలో పేదలకు అందాల్సిన నిధులు పక్కదారి పట్టాయని, అక్రమాలపై సమగ్ర విచారణ చేయిస్తామన్నారు. ఈ మాటలు అంటున్నది స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అవినీతి సహించేది లేదని, అవినీతి జరిగితే సంబంధిత ఐసీడీఎస్‌ పీడీలదే బాధ్యత అని సంబంధిత శాఖ మంత్రి తానేటి వనిత హెచ్చరించారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పథకాలపై మంత్రి తానేటి వనిత సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశానికి ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళల సంక్షేమమే సీఎం వైయస్‌ జగన్‌ సర్కారు ధ్యేయమన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు. అధికారులు నిబద్ధతో పనిచేయాలని సూచించారు.


అయితే ఇక్కడ వైసీపీ మంత్రులు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. చంద్రబాబు పాలనలో అవినీతి వెలికి తీస్తాం.. అన్న డైలాగు ఇంకొన్ని రోజులు మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే.. ఇప్పుడు అధికారం మీ చేతిలోనే ఉంది కదా.. మరి మీరేం చేస్తున్నారు.. అని జనం ప్రశ్నించే రోజు వస్తుంది. అందుకే ఆ బాబుగారి బండారం అంటూ మీరు చెప్పేది ఏదో.. త్వరగా బయటపెడితే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: