30 పదుల సంవత్సరాల నుంచి సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న వివాదాస్పద అయోధ్య కేసు విచారణ వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా మూడు పదుల వివాదానికి సుప్రీంకోర్టు నిన్న సంచలన తీర్పుతో ముగింపు పలికింది.అయోధ్యలో  బాబ్రీ మసీదు నిర్మించాలని ముస్లింలు... రామమందిరం  నిర్మించాలని  హిందువులు మధ్య తలెత్తిన వివాడానికి  చివరికి నిన్న తెరపడింది. ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత ధర్మాసనం వివాదాస్పద స్థలం అయోధ్య కేసు పై సంచలన తీర్పును వెలువరించింది. దీంతో ఎన్నో సంవత్సరాలనుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ కేసు కి ముగింపు పలికి నట్లయింది. వివాదాస్పద అయోధ్య భూభాగం తమదేనంటూ ముస్లిం సంస్థలు నిరూపించుకోకపోవడంతో వివాదాస్పద భూభాగాన్ని రామమందిర నిర్మాణానికి హిందువులకు చెందిన న్యాస్ కి అప్పగిస్తూ  సంచలన తీర్పును వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం. 



 కాగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశించింది. అంతేకాకుండా ముస్లింల బాబ్రీ మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల భూమి కేటాయించాలని ఈ భూమిని సున్ని వక్ఫ్  బోర్డ్ కు కేటాయించాలని తెలిపింది. కాగా  సుప్రీంకోర్టు తీర్పుపై దేశ ప్రజల హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరువర్గాల సమ్మతించేలా  సుప్రీంకోర్టు తీర్పు ఉందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు పై బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ స్పందించారు. సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో  హిందువుల చిరకాల కోరిక అయినా అయోధ్యలో రామమందిర నిర్మాణం కల నెరవేరబోతుందని అద్వానీ  అన్నారు. 



అంతేకాకుండా దశాబ్దాల కల నెరవేరిందని తెలిపిన అద్వానీ భారత సాంస్కృతిక వారసత్వ సంపదల్లో రామజన్మభూమిది  ప్రత్యేకమైన స్థానం అని ఆయన అన్నారు. కోట్లాది మంది ప్రజల నమ్మకాలను నిలుపుతూ వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అద్వానీ తెలిపారు. ఇకపై దేశంలో ఎటువంటి హింసకు తావులేకుండా శాంతి సామరస్యాలు నెలకొల్పేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎల్కే అద్వానీ అభిప్రాయం వ్యక్తం చేసారు. కులం మతం వర్గం తేడాలేకుండా దేశంలోని ప్రజలందరూ ఒక్కటై  దేశ ఐక్యత సమగ్రతను  బలపర్చాలని ఎల్కే అద్వానీ ప్రజలకు పిలుపునిచ్చారు . ఇక బాబ్రీ మసీదు నిర్మాణానికి సున్ని వక్ఫ్ బోర్డుకు  ఐదెకరాల భూమిని కేటాయించాలన్న అత్యున్నత న్యాయస్థానం తీర్పును బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ స్వాగతించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: